Rounak Chouhan : యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ రౌనక్ చౌహాన్ (Rounak Chouhan) దూసుకెళ్తున్నాడు. ప్రీ-క్వార్టర్స్‌లో ఆరో ర్యాంకర్‌కు షాకిచ్చిన ఈ కుర్రాడు.. అదిరే విజయంతో సెమీస్ ఫైనల్లో అడుగుపెట్టాడు. శనివారం పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఒలింపియన్ మిషా జిల్బెర్మన్ (ఇజ్రాయేల్)ను మట్టికరిపించాడు. వరస సెట్లలో జోరు చూపించిన భారత సంచలనం 23-21, 21-11తో మిషాను చిత్తు చేసి సెమీస్ బెర్తు పట్టేశాడు.
అమెరికా వేదికగా జరుగుతున్న యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో రౌనక్ చౌహన్ జోరు చూపిస్తున్నాడు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 18 ఏండ్ల రౌనక్ సంచలన ఆటతో టాప్ సీడ్లకు షాకిస్తున్నాడు. ప్రీక్వార్టర్స్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్ చౌ టీన్ చెన్ (చైనీస్ తైపీ)ను 21-17, 26-24తో మట్టికరిపించిన భారత షట్లర్. క్వార్టర్స్‌లోనూ రెచ్చిపోయాడు. టాప్ సీడ్ మిషా జిల్బెర్మన్కు ముచ్చెమటలు పట్టించి.. తొలి సెట్‌ను 23-21తో గెలుచుకున్నాడు. రెండో సెట్లో ఇజ్రాయేల్ షట్లర్ ప్రతిఘటించినా.. చివరకు 21-11 రౌనక్ పైచేయి సాధించి సెమీస్‌లో అడుగుపెట్టాడు.
𝟭𝟴 𝘆𝗿 𝗼𝗹𝗱 𝘀𝗵𝘂𝘁𝘁𝗹𝗲𝗿 𝗥𝗼𝘂𝗻𝗮𝗸 𝗖𝗵𝗼𝘂𝗵𝗮𝗻 𝘀𝘁𝗼𝗿𝗺𝘀 𝗶𝗻𝘁𝗼 𝗦𝗘𝗠𝗜𝗦 𝗼𝗳 𝗨𝗦 𝗢𝗽𝗲𝗻 (𝗦𝘂𝗽𝗲𝗿 𝟯𝟬𝟬) 🔥
Beats European medalist Misha Zilberman 23-21, 21-11.
#USOpen2026 #Badminton pic.twitter.com/IcnAhtV58y
— India_AllSports (@India_AllSports) June 27, 2026
చూస్తుంటే.. ఈసారి పురుషుల సింగిల్స్‌లో భారత్‌కే చెందిన కిడాంబి శ్రీకాంత్( Kidambi Srikanth)ను ఫైనల్లో రౌనక్ ఢీకొనేలా ఉన్నాడు. క్వార్టర్స్‌లో చైనీస్ తైపీ ఆటగాడు లియావో ఝువో ఫును చిత్తుగా ఓడించిన శ్రీకాంత్.. శనివారం సెమీస్‌లో యుడాయ్ ఓకిమొటో(జపాన్)తో తలపడనున్నాడు. ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ గెలిచి.. రౌనక్ సెమీస్ దాటితే ఫైనల్ ఫైట్ వీరిద్దరి మధ్యే జరగడం ఖాయం.