Cristiano Ronaldo | పోర్చుగల్ స్టార్ రొనాల్డోకు చెఫ్ కావాలంట.. జీతం ఎంతో తెలుసా..?
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో పర్సనల్ చెఫ్ కోసం చాలా రోజులుగా వెతుకుతున్నా ఎవరూ దొరకడం లేదట. పోర్చుగీస్ ఆహారం, సుషీ వంటి ఇంటర్నేషనల్ ఫుడ్స్‌ను వండగల సత్తా ఉన్న చెఫ్కోసం వెతుకుతున్నారట.
Cristiano Ronaldo | పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో గురించి తెలియనివారు ఉండరు. అతని ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. అంతపెద్ద స్టార్ ప్రస్తుతం ఓ విచిత్రమైన సమస్యతో బాధపడుతున్నాడట. అయితే, అది ఆటకు సంబంధించింది కాదు. తనకు, కుటుంబ సభ్యులకు రుచికరంగా వంట చేసిపెట్టే వ్యక్తి కోసం గత కొన్ని రోజులుగా వెతుకుతున్నా ఎవరూ దొరకడం లేదట. దీంతో అతను తీవ్ర నిరాశతో ఉన్నాడు.
రొనాల్డో తన కెరీర్ చివర్లో కుటుంబంతో కలిసి పోర్చుగల్‌కు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాడు. ఈ మేరకు ఇప్పటికే అక్కడ ఓ విలాసవంతమైన ఇంటిని నిర్మించే పనిలో పడ్డాడట. సెప్టెంబర్ 2021లో ఇంటి కోసం భూమిని కొనుగోలు చేసి నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. జూన్ 2023 నాటికి ఆ ఇంటి నిర్మాణం పూర్తవుతుందని సమాచారం. ఆ ఇంటి ఖరీదు 17 మిలియన్ పౌండ్స్. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఏకంగా రూ.170 కోట్లన్న మాట. మరికొన్ని రోజుల్లో భార్య, పిల్లలతో రొనాల్డో ఆ ఇంటికి షిఫ్ట్ అవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.

అయితే, పర్సనల్ చెఫ్ కోసం చాలా రోజులుగా వెతుకుతున్నా ఎవరూ దొరకడం లేదట. పోర్చుగీస్ ఆహారం, సుషీ వంటి ఇంటర్నేషనల్ ఫుడ్స్‌ను వండగల సత్తా ఉన్న చెఫ్కోసం వెతుకుతున్నారట. ఇక చెఫ్‌గా చేరేవారికి భారీగా జీతం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తన వద్ద చెఫ్‌గా చేరిన వ్యక్తికి నెలకు 4,500 పౌండ్లు ఇచ్చేందుకు కూడా వెనకాడటం లేదట. అంటే మన ఇండియన్ కరెన్సీలో నెలకు రూ.4.5లక్షలన్నమాట. ఈ లెక్కన ఏడాదికి రూ.54లక్షలు. ఈ ప్యాకేజీ పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కూడా ఉండకపోవచ్చు.
ఇక, రొనాల్డో ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్నాడు. సౌదీ అరేబియా క్లబ్ అల్ నాసర్ తరఫున ఆడేందుకు ఇటీవల రొనాల్డో అక్కడికి వెళ్లాడు. మాంచెస్టర్ యునైటెడ్ యాజమాన్యంతో విభేదాల కారణంగా ఈ ఐరోపా క్లబ్‌తో రొనాల్డో బంధాన్ని తెంచుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత సౌదీలో ప్రముఖ క్లబ్‌గా పేరొందిన అల్ నసర్..రొనాల్డోతో జూన్ 2025 వరకు ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాదికి 200 మిలియన్ యూరోల చొప్పున మొత్తంగా రికార్డు స్థాయిలో 4,400 కోట్ల రూపాయలతో డీల్ కుదిరింది. సాకర్ చరిత్రలో ఒక ప్లేయర్‌కు దక్కనున్న అత్యధిక మొత్తం ఇదే కావడం విశేషం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

