Rohit on Virat Kohli | కోహ్లీపై ప్రశ్నల పట్ల హిట్‌మ్యాన్ ఫైర్.. ఎందుకంటే!
Rohit on Virat Kohli | మీడియాపై రోహిత్‌శర్మ ఫైరయ్యాడు. కోహ్లీ ఫామ్ గురించి కొన్నాళ్లు మీడియా మౌనంగా ఉండాలని చెప్పాడు.
Rohit on Virat Kohli | మాజీ సారధి విరాట్ కోహ్లీ ఫామ్ గురించి మీడియా ప్రశ్నలపై టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. కోహ్లీ ఫామ్ గురించి ప్రశ్నలు అడగడం ఆపేయండన్నాడు. విరాట్ కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. బుధవారం నుంచి వెస్టిండీస్‌తో టీ-20 సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కోహ్లీకి దన్నుగా నిలిచాడు. ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలోనే కోహ్లీ ఫామ్ గురించి మీడియా ప్రశ్నలు సంధించింది. కోహ్లీ ఫామ్ గురించి మీడియాలోనే వార్తలొస్తున్నాయన్నాడు రోహిత్. ఒకవేళ కొంతకాలం మీడియా మౌనంగా ఉంటే అంతా బాగుంటుందన్నాడు.
విండీస్‌తో సిరీస్‌పై ఫోకస్ చేయండి
వెస్టిండీస్‌తో బుధవారం టీ-20 సిరీస్ ప్రారంభం అవుతున్నది. ఈ నేపథ్యంలో టీం ఇండియా సారధి రోహిత్‌శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆటగాళ్లు వేలంపై చర్చ పక్కనబెట్టి వచ్చే రెండు వారాలు వెస్టిండీస్ టీ-20 సిరీస్‌పై దృష్టి సారించాలని సూచించాడు. బుధవారం వెస్టిండీస్‌తో టీం ఇండియా తొలి టీ-20 మ్యాచ్ ఆడుతుంది. ఇదిలా ఉంటే ఐపీఎల్-2022 సీజన్ వచ్చేనెల 27 నుంచి ప్రారంభించాలని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి.
ఇంటివాడు కానున్న మ్యాక్స్‌వెల్
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. భారత సంతతికి చెందిన తన గర్ల్‌ఫ్రెండ్ విని రామన్ మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. 2017 నుంచి వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. 2020 ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. వచ్చేనెల 27న మెల్బోర్న్లో తమిళ సంప్రదాయ పద్దతిలో పెండ్లి జరుగనున్నది. 2022 ఐపీఎల్ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ (ఆర్సీబీ) తరఫున ఆడనున్నాడు. ఆయన్ను ఆర్సీబీ రూ.11 కోట్లకు రిటైన్ చేసుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

