IPL 2021 | కంటతడి పెట్టిన పంత్, పృథ్వీ షా
ఐపీఎల్( IPL 2021 )లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. గత సీజన్లో ఫైనల్ వరకూ వచ్చినా ట్రోఫీ అందుకోలేకపోయిన ఆ టీమ్.. ఈసారి క్వాలిఫైయర్ 2లో ఇంటిబాట పట్టింది.

దుబాయ్: ఐపీఎల్( IPL 2021 )లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. గత సీజన్లో ఫైనల్ వరకూ వచ్చినా ట్రోఫీ అందుకోలేకపోయిన ఆ టీమ్.. ఈసారి క్వాలిఫైయర్ 2లో ఇంటిబాట పట్టింది. కేవలం మరో బంతి మిగిలి ఉన్న సమయంలో రాహుల్ త్రిపాఠి సిక్స్ కొట్టడంతో కోల్‌కతా ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్ చేరింది. దీంతో మ్యాచ్ తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్, ఓపెనర్ పృథ్వి షా భావోద్వేగానికి గురయ్యారు. త్రిపాఠి సిక్స్ కొట్టగానే పృత్వి షా గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లోనూ అతడు దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించాడు.
ఇక మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. ఇప్పుడేమీ మార్చలేము కదా అంటూ ఎంతో నిర్వేదంతో అతడు మాట్లాడాడు. మమ్మల్ని మేము విశ్వసించినంతసేపూ మేము మ్యాచ్‌పై పట్టు సడలించలేదు. అయితే కోల్‌కతా చాలా బాగా బౌలింగ్ చేసింది. మేము మధ్య ఓవర్లలో తడబడ్డాం. వచ్చే ఏడాది మరింత బలంగా వస్తామని పంత్ అన్నాడు. క్వాలిఫయర్ 1లో చెన్నై చేతిలో, క్వాలిఫయర్ 2లో కోల్‌కతా చేతుల్లో ఓడి ఢిల్లీ ఇంటిదారి పట్టింది.

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

