IPL 2023: ఐపీఎల్ పదహారో సీజన్లో పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలిగిన ఢిల్లీ క్యాపిటల్స్ చెలరేగింది. పంజాబ్ కింగ్స్ సొంత గ్రౌండ్ ధర్మశాలలో రిలే రస్సో(82 నాటౌట్ : 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), ఓపెనర్ పృథ్వీ షా(54) హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. ఫామ్‌లో ఉన్న ఫిలిఫ్ సాల్ట్(26 నాటౌట్ : 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు ) ధనాధన్ ఆడడంతో వార్నర్ సేన 2 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.
హర్‌ప్రీత్ బ్రార్ వేసిన 20 ఓవర్లో రిలే రస్సో(82 నాటౌట్) తొలి రెండు బంతుల్ని సిక్స్, ఫోర్‌గా మలిచాడు. దాంతో, ఢిల్లీ స్కోర్ 200 దాటింది. మూడో బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. ఆఖరి బంతికి ఫిలిఫ్ సాల్ట్(26 నాటౌట్) ఫోర్ కొట్టాడు. దాంతో, ఢిల్లీ 2 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.
టాస్ ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (46), పృథ్వీ షా(54) శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 94 రన్స్ జోడించారు. ఆ తర్వాత వచ్చిన రస్సో, సాల్ట్ దంచికొట్టాడు. దాంతో వార్నర్ సేన పరుగులు చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో సామ్ కరన్ రెండు వికెట్లు తీశాడు.