న్యూఢిల్లీ: రెడ్‌బుల్ రేసన్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఈ సీజన్లో పదో టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం జరిగిన బెల్జియం గ్రాండ్ ప్రిలో డిఫెండింగ్ చాంపియన్ వెర్స్టాపెన్ గంటా 22 నిమిషాల 30 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు.
వెర్‌స్టాపెన్‌కు ఇది వరుసగా 8వ విజయం కాగా.. ఈ సీజన్లో పదోది. పెరేజ్ (రెడ్‌బుల్), లెక్లెర్క్ (ఫెరారీ) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు.