Real Madrid : స్పెయిన్‌కు చెందిన ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్ రియల్ మాడ్రిడ్ క్లబ్ కొత్త అధ్యాయం లిఖించింది. తొలిసారిగా ఒక్క స్పెయిన్ ఆటగాడు లేకుండా లా లిగ మ్యాచ్ ఆడనుంది. తమ దేశానికి చెందిన ఆటగాడిని ఎంపిక చేయకపోవడం అనేది 120 ఏళ్ల ఆ క్లబ్ చరిత్రలో ఇదే మొదటిసారి. విలర్రీల్తో శనివారం జరిగిన లా లిగా మ్యాచ్‌కు 11 మంది విదేశీ ఆటగాళ్లను సెలక్ట్ చేసింది. వీళ్లలో ఫ్రాన్స్ నుంచి ముగ్గురు, బ్రెజిల్, జర్మనీ నుంచి ఇద్దరు, బెల్జియం, క్రొయేషియా, ఆస్ట్రియా, ఉరుగ్వే దేశాలకు చెందిన ఒక్కొక్కరికి చోటు కల్పించింది. తమ దేశానికి చెందిన ఆరుగురు ఆటగాళ్లను బెంచ్‌కే పరిమితం చేసింది. అయితే.. ఈ మ్యాచ్‌లో రియల్ మాడ్రిడ్ 1-2తో ఓడిపోయింది. విలర్రీల్ ఆటగాడు ఎరెమి పినో తొలి గోల్ చేశాడు. మెరొనే రెండో గోల్ కొట్టడంతో ఆ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
రియల్ మాడ్రిడ్ క్లబ్‌ను 1902లో ఏర్పాటు చేశారు. ఈ ఫ్రొఫెషనల్ పుట్‌బాల్ క్లబ్ ప్రధాన కార్యాలయం మాడ్రిడ్‌లో ఉంది. ఈ క్లబ్ తరఫున ఆడిన స్టార్ ఆటగాళ్లలో కొందరు.. కరిం బెంజెమ, ఈడెన్ హజర్డ్, ల్యూకా మొడ్రిక్, మార్కో అసెన్సియో,