Bhuvaneshwar Kumar : పంతొమ్మిదో సీజన్లో పర్పుల్ క్యాప్ రేసులో ముందున్న భువనేశ్వర్ కుమార్ (Bhuvaneshwar Kumar) బ్యాటుతోనూ వారెవ్వా అనిపించాడు. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో హోరాహోరీ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో కవర్స్ దిశగా సిక్సర్‌తో ఆర్సీబీ విజయంలో కీలకమయ్యాడీ పేసర్. అతడి సిక్సర్‌తో ముంబై ఇంటిదారి పట్టగా బెంగళూరు విజయంతో మురిసింది. మ్యాచ్ అనంతరం ఇదే విషయంపై ప్రశ్నించగా ‘అవును సిక్సర్‌ను చాలా ఆస్వాదించాను’ అని భువనేశ్వర్ తెలిపాడు.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంతొమ్మిదో సీజన్లో దుమ్ము రేపుతోంది. ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతున్న ఆదివారం ఉత్కంఠ పోరులో ముంబైపై విజయంతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో భువనేశ్వర్ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముంబై నుంచి లాగేసుకున్నాడు. సంచలన బౌలింగ్ ప్రదర్శనతోనే వార్తల్లో నిలుస్తున్న ఈ సీనియర్ పేసర్ ఈసారి బ్యాట్‌తోనూ జట్టును గెలిపించాడు.
— ESPNcricinfo (@ESPNcricinfo) May 11, 2026
బంతితో నాలుగు వికెట్లు కూడా తీసినందుకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికైన భువి మాట్లాడుతూ.. ‘నేను చాలాసార్లు బాగా బౌలింగ్ చేశాను. కొన్ని వికెట్లు తీశాను కూడా. నాకు బౌలింగ్ కంటే బ్యాటింగ్ చేయడం చాలా ఇష్టం. నిజంగా నేను ఆ సిక్సర్‌ను చాలా ఎంజాయ్ చేశాను’ అని తెలిపాడు. ఫ్రాంచైజీ, హెడ్‌కోచ్, కెప్టెన్లు తనపై నమ్మకం ఉంచారని.. స్వేచ్ఛగా ఉండేందుకు అనుమతించడం కారణంగానే తాను గొప్పగా రాణిస్తున్నానని ఈ వెటరన్ చెప్పాడు. నేను విజయవంతమవ్వడంలో ఫిజియో, ట్రైనర్ల కృషి కూడా ఉందని భువి పేర్కొన్నాడు. ఇప్పటివరకూ 11 మ్యాచుల్లో 15.29 సగటుతో భువి 21 వికెట్లు పడగొట్టాడు.
This one’s for the history books. 🙏 pic.twitter.com/7JmTnEQi91
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 10, 2026
రాయ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబైని 166కే కట్టడి చేసిన ఆర్సీబీ స్వల్ప ఛేదనలో తడబడింది. టాపార్డర్ విఫలమైనా.. ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా(73) మెరుపులతో కోలుకున్న బెంగళూరును ఆఖర్లో ముంబై బౌలర్లు వణికించారు. మ్యాచ్ చేజారుతున్న వేళ ఆపద్భాందవుడిలా అవతరిండాడు భువనేశ్వర్.
The BHUVI effect! 🌪️
The Purple Cap is back with #BhuvneshwarKumar after his brilliant 4/23! 👏
Hear it from the man himself! 📽️#TATAIPL Revenge Week 2026 ➡️ #RCBvMI | LIVE NOW 👉https://t.co/y41wRLoDHD pic.twitter.com/xskTJlWh9i
— Star Sports (@StarSportsIndia) May 10, 2026
చివరి ఓవర్లో రొమారియో షెపర్డ్ ఔటయ్యాక 15 రన్స్ అవసరమైన వేళ.. రాజ్ బవ వైడ్, నో బాల్ వేయగా నాలుగో బంతిని కవర్స్ దిశగా భువి స్టాండ్స్‌లోకి పంపాడు. ఆ సిక్సర్‌తో ముంబై ఆశలు ఆవిరవ్వగా.. ఐదో బంతికి సింగిల్, ఆరో బంతికి రెండు పరుగులు రాగా బెంగళూరు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.