RCB Stars : ఐపీఎల్ మ్యాచులతో బిజీగా గడుపుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఆటగాళ్లు గల్లీ క్రికెట్ ఆడి సందడి చేశారు. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ కోసం ఢిల్లీ చేరుకున్న ఆర్సీబీ ఆటగాళ్లు స్థానికులతో కలిసి క్రికెట్ ఆడారు. హిట్టర్ టిమ్ డేవిడ్(Tim David), ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్(Romario Shepherd)లు ఒక వీధిలో లోకల్ బాయ్స్‌లా బ్యాటింగ్ చేశారు. అనంతరం వారితో కలిసి ఫొటోలు దిగారు. అయితే.. ఢిల్లీలోని ఏ ప్రాంతంలో వీరు గల్లీ క్రికెట్ ఆడారు? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.
పంతొమ్మిదో సీజన్లో చెలరేగిపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ రేసులో దూసుకెళ్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ అద్భుత ఆటతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఏడు మ్యాచుల్లో ఐదు విజయాలు సాధించిన బెంగళూరు ఆరో విజయంపై కన్నేసింది. సోమవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో బెంగళూరు తలపడుతోంది.
RBC batsman Tim David and Romario Shepherd are playing Gully cricket in Dehli where the temperature is 45°. 🥵🔥pic.twitter.com/LPifqjmtoJ
— CricSachin (@Sachin_Gandhi7) April 27, 2026
Tim David and Romario Shepherd were seen playing Gully cricket ahead of all important RCB vs DC clash !
Both are chill guys 😁
Can we expect something big from them today ? https://t.co/AD6XYusjUK pic.twitter.com/kGg00EZ2FM— Cricket IQ (@S17Anurag) April 27, 2026