Faf Duplesis | ఐపీఎల్ వేలంపై అనాసక్తి.. సంచలన నిర్ణయ తీసుకున్న ఆర్సీబీ మాజీ కెప్టెన్..!
Faf Duplesis : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ కోసం జరుగబోయే మినీ వేలానికి ముందే అభిమానులకు షాకింగ్ న్యూస్. రాయల్ ఛాలెంజర్స్ (RCB) మాజీ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ (Faf Duplesis) వేలం నుంచి వైదొలిగాడు.
Faf Duplesis : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ కోసం జరుగబోయే మినీ వేలానికి ముందే అభిమానులకు షాకింగ్ న్యూస్. రాయల్ ఛాలెంజర్స్ (RCB) మాజీ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ (Faf Duplesis) వేలం నుంచి వైదొలిగాడు. ఈసారి ఆక్షన్‌లో తన పేరు రిజిష్టర్ చేసుకోవడం లేదని దక్షిణాఫ్రికా క్రికెటర్ చెప్పాడు. సుదీర్ఘకాలం ఐపీఎల్ ఆడానని.. ఈసారి కొత్తగా మరో టీ20 లీగ్‌లో ఆడాలని ఆశపడుతున్నాని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడీ సఫారీ మాజీ సారథి. ఈ విషయాన్ని శనివారం స్వయంగా పంచుకున్న డూప్లెసిస్ కారణం ఏం చెప్పాడంటే..?
ఈసారి కూడా గల్ఫ్ గడ్డమీద.. అబుధాబీలో డిసెంబర్ 16 ఐపీఎల్ మినీ వేలం జరుగనుంది. పంతొమ్మిదో సీజన్ కోసం ఎవరిని కొనాలి? అని ఫ్రాంచైజీలు కసరత్తు చేస్తుండగా.. ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ నేను వేలంలో పాల్గొనడం లేదు అని చెబుతున్నాడు ఫాఫ్ డూప్లెసిస్.
‘పద్నాలుగేళ్లు ఐపీఎల్ ఆడాను. ఈసారి మాత్రం వేలంలో పేరు రిజిష్టర్ చేసుకోవడం లేదు. ఐపీఎల్ వంటి లీగ్‌లో ఆడకూడదనుకోవడం చాలా పెద్ద నిర్ణయం. నా క్రికెటింగ్ కెరీర్లో ఈ లీగ్ పాత్ర మరువలేనది. వరల్డ్ క్లా్స్ ఆటగాళ్లైన సహచరులతో ఆడడం, అద్భుతమైన ఫ్రాంచైజీలతో కొనసాగడం, క్రికెట్‌ను ఎంతో ప్రేమించే అభిమానుల ముందు ఆడడం అదృష్టంగా భావిస్తున్నా. భారతదేశం నాకు చాలామంది స్నేహితులను ఇచ్చింది. ఎన్నో జీవిత పాఠాలను, మధుర జ్ఞాపకాలను నాకు మిగిల్చింది. అంతేకాదు క్రికెటర్‌గా, వ్యక్తిగా నన్ను ఎంతో మార్చింది.
No Faf in the IPL 2026 auction – he’ll play in the PSL this year 🏏 pic.twitter.com/2QISCO7J9G
— ESPNcricinfo (@ESPNcricinfo) November 29, 2025
ఈ పద్నాలుగేళ్ల ప్రయాణంలో నాకు అన్నివిధాలా మద్దతు పలికిన కోచ్‌లు, సహచులు, సహాయక సిబ్బంది.. ప్రతి ఒక్క అభిమానికి కృతజ్ఞతలు. నా హృదయంలో భారత్‌కు ప్రత్యేక స్థానముంది. అలాఅనీ ఐపీఎల్‌కు నేను మొత్తానికి గుడ్ బై చెప్పడం లేదు. మరోసారి నన్ను మీరు ఐపీఎల్లో చూస్తారు. అయితే.. ఈసారి మాత్రం కొత్త సవాల్ స్వీకరించాలనుకుంటున్నా. అందుకే.. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్నా’ అని డూప్లెసిస్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.
Faf Duplesis You Beauty ❤️#CricketTwitter #IPL2025 pic.twitter.com/kTVITtK9yg
— RCBIANS OFFICIAL (@RcbianOfficial) July 13, 2024
ఇప్పటివరకూ డూప్లెసిస్ నాలుగు జట్లకు ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. సీఎస్కే ఆటగాడిగా రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచాడు ఫాఫ్. పద్నాలుగు సీజన్లలో 154 మ్యాచ్‌లు ఆడిన అతడు 135.79 స్ట్రయిక్ రేటుతో 4,773 పరుగులు సాధించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

