Ashwin’s Wife | ఏడో తరగతి నుంచి ఆయనకు నేనంటే చచ్చేంత ప్రేమ.. జియో సినిమాతో అశ్విన్ భార్య ప్రీతి చిట్‌చాట్
Ashwin's Wife | ఇండియన్ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గత దశాబ్దకాలంగా అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో విజయాలు సాధిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం IPL 2023లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున తన స్పిన్ మాయాజాలాన్ని కొనసాగిస్తున్నాడు.
న్యూఢిల్లీ: ఇండియన్ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గత దశాబ్దకాలంగా అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో విజయాలు సాధిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం IPL 2023లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున తన స్పిన్ మాయాజాలాన్ని కొనసాగిస్తున్నాడు. అతని భార్య ప్రీతి అశ్విన్ 36 ఏండ్ల అశ్విన్‌కు ప్రధాన బలంగా ఉంది. తాజాగా ప్రీతి తన భర్త అశ్విన్ గురించి మాట్లాడేందుకు జియో సినిమాలో AJIO మ్యాచ్ సెంటర్ లైవ్ ప్రోగ్రామ్ అయిన ‘హ్యాంగ్వుట్’ లో దర్శనమిచ్చింది.
అక్కడ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి, డానిష్ సేత్‌లు హోస్ట్‌లుగా వ్యవహరించారు. యూనిక్ చెస్ గేమ్ ఆడుతూ వారు ప్రీతితో తమ సంభాషణలను కొనసాగించారు. వారి ప్రశ్నలకు ప్రీతి ఇచ్చే సమాధానాల ఆధారంగా చెస్ బోర్డులో రాజు (రవిచంద్రన్ అశ్విన్), రాణి (ప్రీతి అశ్విన్) పావులను ఒక్కో స్టెప్ ముందుకు జరిపారు. ఈ సందర్భంగా.. దంపతులైన తర్వాత, దంపతులు కాకముందు అశ్విన్‌తో తనకున్న పరిచయం గురించి, సంబంధం గురించి ప్రీతి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
చిన్నప్పుడు అశ్విన్, తాను ఒకే మిడిల్ స్కూల్లో చదువుకునే వాళ్లమని, మేం ఏడో తరగతిలో ఉన్నప్పటి నుంచే అశ్విన్ తానంటే చచ్చేంత ప్రేమ అని, ఆ విషయం మా స్కూళ్లో అందరికీ తెలుసని ప్రీతి గుర్తు చేసుకుంది. ఆ తర్వాత క్రికెట్లో శిక్షణ కోసం అశ్విన్ స్కూల్ మారాడని, అప్పటి నుంచి తాము పుట్టినరోజులు, ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఎదురుపడేవాళ్లమని చెప్పింది. కొన్నేళ్లకు తాను ఓ ఈవెంట్ కంపెనీలో ఉద్యోగంలో చేరానని, విధి నిర్వహణలో భాగంగా తాను చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ అకౌంట్‌ను హ్యాండిల్ చేసేందుకు వెళ్లానని, ఆ సమయంలో ఒక్కసారిగా అశ్విన్ ప్రత్యక్షమయ్యాడని, చిన్నప్పుడు చిన్నగా అశ్విన్ అప్పుడు 6 అడుగుల ఎత్తుతో దర్శనమిచ్చాడని వెల్లడించింది.
అశ్విన్ మళ్లీ కనిపించడంతో అప్పటిదాకా బ్రేక్ పడిన తమ పరిచయం మళ్లీ కొనసాగిందని ప్రీతి చెప్పింది. అశ్విన్ స్ట్రెయిట్ షూటర్ అంటూ.. ఓ సారి అతను ఆమెను క్రికెట్ గ్రౌండ్‌కు తీసుకెళ్లి ప్రేమ విషయం చెప్పిన సందర్భాన్ని గుర్తుచేసుకుంది. అక్కడ అశ్విన్ తనతో ‘నేను జీవితాంతం నిన్ను ప్రేమగా చూసుకుంటాను, గత పదేళ్ల నుంచి నీ మీద నాకున్న ప్రేమలో ఏ మాత్రం మార్పులేదు. ఇకపై కూడా మార్పు ఉండదు. మనిద్ధరం పెద్దవాళ్లమయ్యాం. ఎందుకు పెళ్లి చేసుకోకూడదు..?’ అని అన్నాడని ప్రీతి వివరించింది.
అంతేగాక అశ్విన్ తనను భర్తగానే కాక, తండ్రిలా కూడా చూసుకుంటాడని చెప్పింది. ఇద్దరం చిన్న విషయాలకు కూడా తరచూ గొడవ పడుతామని, ఇవాళ ఉదయం కూడా ఇద్దరి మధ్య వాదన జరిగిందని, అయితే దేని గురించి వాదన జరిగిందో తనకు గుర్తేలేదని తెలిపింది. అదేవిధంగా అశ్విన్ తనను ఎప్పుడూ కొత్తకొత్త ఫన్నీ పేర్లతో పిలుస్తూ ఆటపట్టిస్తాడని ప్రీతి వెల్లడించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

