ప్చ్.. అశ్విన్ 43 ఓవర్లు వేసినా.. ఒక్క వికెటే

లండన్: ఇంగ్లండ్‌తో కీలకమైన ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం కౌంటీల్లో ఆడుతున్న అశ్విన్ నిరాశపరిచాడు. సర్రే టీమ్ తరఫున సోమర్‌సెట్‌తో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అతడు ఏకంగా 43 ఓవర్లు వేశాడు. అయినా ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు. ఆ టీమ్ తరఫున బౌలింగ్ ఓపెన్ చేసింది కూడా అశ్వినే. అయితే మ్యాచ్ 40వ ఓవర్లో అశ్విన్ వికెట్ తీశాడు. టామ్ లామోన్బీని క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇక ఆ తర్వాత అతనికి మళ్లీ వికెట్ దక్కలేదు. గత ఫిబ్రవరి-మార్చిలో ఇంగ్లండ్.. ఇండియా టూర్‌కు వచ్చినప్పుడు అశ్విన్ చెలరేగి బౌలింగ్ చేశాడు. ఏకంగా 32 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు.
ఇప్పుడు ఇంగ్లండ్‌లోనూ అదే ఫామ్ కొనసాగించాలనుకుంటున్న అశ్విన్.. ప్రత్యేకంగా కౌంటీ మ్యాచ్‌లో ఆడుతున్నాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆడినా.. స్పిన్‌కు పెద్దగా సహకరించని పిచ్‌పై అశ్విన్ రాణించలేకపోయాడు. మ్యాచ్‌లో కేవలం 4 వికెట్లు తీయగలిగాడు. ఆదివారం నుంచి సర్రే తరఫున మ్యాచ్ ఆడుతున్న అశ్విన్.. తొలి రెండు రోజుల్లో మొత్తం 43 ఓవర్లు వేశాడు. సాధ్యమైనంత ఎక్కువ ప్రాక్టీస్ కోసం చూస్తున్న అశ్విన్.. టీమ్‌లో అందరికంటే ఎక్కువ ఓవర్లు వేయడం విశేషం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

