నాదల్ జోరు
- 15వసారి సెమీస్ చేరిన రఫేల్
- క్వార్టర్స్‌లో జొకోవిచ్పై జయభేరి
- ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
పారిస్: మట్టికోట మహారాజు రఫేల్ నాదల్.. మరో టైటిల్‌కు చేరువయ్యాడు. తనకు అచ్చొచ్చిన రోలాండ్ గారోస్‌లో 14వసారి చాంపియన్‌గా నిలిచేందుకు స్పెయిన్ బుల్ నాదల్ రెండడుగుల దూరంలో నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో నాదల్ 6-2, 4-6, 6-2, 7-6 (7/4)తో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ నోవాక్ జొకోవిచ్ (సెర్బియా) ను చిత్తు చేసి సెమీస్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఫ్రెంచ్ ఓపెన్‌లో 13 టైటిల్స్ నెగ్గిన నాదల్.. సెమీస్‌లో జ్వెరెవ్ (జర్మనీ)తో తలపడనున్నాడు. పురుషుల టెన్నిస్‌లో అత్యధిక (21) గ్రాండ్‌స్లామ్స్ ఖాతాలో వేసుకున్న నాదల్.. క్వార్టర్స్ పోరులో జొకోపై సంపూర్ణ ఆధిపత్యం కనబర్చాడు. 4 గంటలా 12 నిమిషాల పాటు సాగిన మ్యాచ్ ఫైనల్ కాని ఫైనల్‌ను తలపించగా.. ఇరువురు ఆటగాళ్లు కొదమ సింహాల్లా పోరాడారు. జొకో 5 ఏస్‌లు సంధించగా.. నాదల్ మూడు కొట్టాడు. చెరో 4 డబుల్ ఫాల్ట్స్ చేయగా.. నాదల్ 7 బ్రేక్ పాయింట్లతో సత్తాచాటాడు. మహిళల క్వార్టర్స్‌లో టాప్ సీడ్ స్వియాటెక్ 6-3,6-2తో జెస్సిక పెగులా పై గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

