KL Rahul | ఐపీఎల్లో రాహుల్ శతకాల సిక్సర్.. క్రిస్ గేల్ రికార్డు సమం..!
KL Rahul : భారత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ (KL Rahul) ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో రెచ్చిపోతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తరఫున దుమ్మురేపుతున్న రాహుల్ ఖతర్నాక్ శతకంతో చెలరేగాడు.
KL Rahul : భారత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ (KL Rahul) ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో రెచ్చిపోతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తరఫున దుమ్మురేపుతున్న రాహుల్ ఖతర్నాక్ శతకంతో చెలరేగాడు. పంజాబ్ కింగ్స్ (Punjab Kings) బౌలర్లను ఎడాపెడా బాదేసిన ఢిల్లీ మైదానంలో జరుగుతున్న మ్యాచ్లో మార్కో యాన్సెన్ ఓవర్లో డబుల్స్, బౌండరీతో రాహుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో అతడికిది ఆరో శతకం కాగా.. ఈ సీజన్లో మొదటిది.
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోసారి తన విశ్వరూపం చూపించాడు. పొట్టి ఫార్మాట్ అంటే శివాలెత్తిపోయే రాహుల్ ఈసారి పంజాబ్ కింగ్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో కసికొద్ది ఆడిన రాహుల్ 47 బంతుల్లోనే శతక గర్జన చేశాడు.
When class meets grace 🤝….
….We get to witness a KL Rahul special 😎👏
Updates ▶️ https://t.co/0oSkMZgNAV#TATAIPL | #KhelBindaas | #DCvPBKS | @DelhiCapitals | @klrahul pic.twitter.com/2dB0UcyVTn
— IndianPremierLeague (@IPL) April 25, 2026
పంజాబ్ పేసర్లను అలవోకగా ఎదుర్కొన్న ఈ సొగసరి బ్యాటర్ యాన్సెన్ ఓవర్లో స్ట్రెయిట్ బౌండరీతో వంద పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో ఆరో శతకం నమోదు చేశాడు రాహుల్. ఈ సెంచరీతో అతడు క్రిస్ గేల్(Chris Gayle) రికార్డును సమం చేశాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీకి ఆడిన గేల్ ఆరు శతకాలతో కదం తొక్కాడు.
టాప్లో కోహ్లీ..
ఐపీఎల్లో అత్యధిక సెంచరీల జాబతాలో విరాట్ కోహ్లీ (Virat Kohli) టాప్లో ఉన్నాడు. ఆరంభ సీజన్ నుంచి ఆర్సీబీని వదలని విరాట్ 8 శతకాలు సాధించాడు. ఏడు సెంచరీలతో జోస్ బట్లర్ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. క్రిస్ గేల్, రాహుల్ ఆరేసి శతకాలతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. ఐదు పర్యాయాలు మూడంకెల స్కోరందుకున్న సంజూ శాంసన్ నాలుగో స్థానం దక్కించుకున్నాడు.
Loud and KLear 🫡
A magnificent 4️⃣7️⃣-ball TON for KL Rahul 👏
Updates ▶️ https://t.co/0oSkMZgNAV#TATAIPL | #KhelBindaas | #DCvPBKS | @klrahul | @DelhiCapitals pic.twitter.com/8XsGGMdB7Q
— IndianPremierLeague (@IPL) April 25, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇరాన్పైకి ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’!
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

