KKR vs LSG | రహానే, రఘువంశీ మెరుపులు.. లక్నో ముందు మోస్తరు లక్ష్యం..!
KKR vs LSG : ఐపీఎల్లో తొలి విజయం కోసం నిరీక్షిస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. పవర్ హిట్టర్లతో నిండిన కోల్‌కతాను లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు.
KKR vs LSG : ఐపీఎల్లో తొలి విజయం కోసం నిరీక్షిస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. పవర్ హిట్టర్లతో నిండిన కోల్‌కతాను లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. అజింక్యా రహానే(41) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆదుకోగా.. రఘువంశీ(45) మెరిశాడు. మిడిల్ ఓవర్లలో స్కోర్ వేగం తగ్గినా.. ఆఖర్లో రొవ్మన్ పావెల్(39 నాటౌట్), కామెరూన్ గ్రీన్(32 నాటౌట్)లు ధనాధన్ ఆడారు. వీరిద్దరు అర్ధ శతకం భాగస్వామ్యం నెలకొల్పడంతో నిర్ణీత ఓవర్లో కేకేఆర్ 181కే పరిమితమైంది.
సొంతమైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు తేలిపోయారు. ఈడెన్ గార్డెన్స్‌లో తమ పవర్ హిట్టింగ్తో లక్సో సూపర్ జెయింట్స్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలనుకున్న కోల్‌కతా 181కే పరిమితమైంది. ప్రిన్స్ యాదవ్ వేసిన రెండో ఓవర్లోనే ఫిన్ అలెన్(9) వెనుదిరగగా.. అజింక్యా రహానే(41) ఆచితూచి ఆడాడు.
Innings Break!
Collective batting effort from @KKRiders 💜
Will they get their opening win tonight? 🤔#LSG chase on the other side ⏳
Scorecard ▶️ https://t.co/ov5gAlAtPH #TATAIPL | #KhelBindaas | #KKRvLSG pic.twitter.com/7x75PvQeWJ
— IndianPremierLeague (@IPL) April 9, 2026
పవర్ ప్లేలో లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగా.. అంగ్క్రిష్ రఘువంశీ(45) జతగా రహానే ఇన్నింగ్స్ నిర్మించాడు. కళాత్మక షాట్లతో విరుచుకుపడిన రఘువంశీ అండతో 84 పరుగులు జోడించిన రహానేను దిగ్వేశ్ వెనక్కి పంపాడు. కాసేపటికే సిద్ధార్థ్ ఓవర్లో రఘువంశీ ఔట్కాగా.. వైస్ కెప్టెన్ రింకూ సింగ్(4) ఇలా వచ్చి అలా వెళ్లాడు.
గ్రీన్, పావెల్ దంచగా..
రహానే వికెట్‌తో 99-2తో పటిష్టంగా ఉన్న కేకేఆర్ ఒక్కసారిగా 111 పరుగులకే బిగ్ వికెట్లు కోల్పోయింది. వెంట వెంటనే మూడు వికెట్లు పడడంతో కోల్‌కతా స్కోర్ వేగం తగ్గింది. ఆ దశలో రొవ్మన్ పావెల్(39 నాటౌట్), కామెరూన్ గ్రీన్(32 నాటౌట్)లు క్రీజునంటుకొని కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.
Flexing their muscles 💪
Rovman Powell and Cameron Green with a powerful late flourish for @KKRiders 👊
Scorecard ▶️ https://t.co/ov5gAlAtPH #TATAIPL | #KhelBindaas | #KKRvLSG pic.twitter.com/JoR1C9cXuu
— IndianPremierLeague (@IPL) April 9, 2026
గత మూడు మ్యాచుల్లో విఫలమైన గ్రీన్ ఎట్టకేలకు పావెల్‌తో కలిసి నిలబడ్డాడు. డెత్ ఓవర్లలో వీరిద్దరూ బ్యాట్ ఝులిపించగా కేకేఆర్ స్కోర్ పరుగులు తీసింది. ప్రిన్స్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో రెండు ఫోర్లు రాగా కోల్‌కతా 181కే పరిమితమైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

