MI vs CSK : వాంఖడే స్టేడియంలో ఆదిలోనే చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) తొలి వికెట్ పడింది. ఓపెనర్‌గా వచ్చిన అజింక్యా రహానే(5) ఔటయ్యాడు. ముంబై పేసర్ కొయేట్జీ బౌలింగ్‌లో భారీ షాట్ ప్రయత్నించి ప్యాండ్యాకు దొరికాడు. దాంతో, 8 పరుగుల వద్ద సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది.
నబీ, బుమ్రాలు కట్టుదిట్టంగా బంతులు వేస్తుండడంతో బౌండరీలు రాలేదు. అయితే.. కొయేట్జీ వేసిన ఐదో ఓవర్లో ప్రస్తుతం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(24) రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. ఓపెనర్ రచిన్ రవీంద్ర 7 పరుగులతో ఆడుతున్నాడు. 5 ఓవర్లకు స్కోర్.. 38/1.