Ajinkya Rahane : పంతొమ్మిదో సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వరుసగా రెండు మ్యాచుల్లో ఓడడంతో కెప్టెన్ అంజిక్యా రహానే (Ajinkya Rahane)పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. రహానే దూకుడుగా ఆడలేకపోవడం కోల్‌కతా విజయావకాశాల్ని దెబ్బతీస్తుందని కామెంటేటర్లు, మాజీ ఆటగాళ్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తన స్ట్రయిక్ రేటుపై వస్తున్న కామెంట్లపై రహానే కరుకుగా స్పందించాడు. కొందరికి తనంటే అసూయ అని, ఉద్దేశపూర్వకంగానే తనపై విమర్శలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చాడు కేకేఆర్ సారథి.
ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంకా బోణీ కొట్టలేదు. తొలి మ్యాచ్‌లో పంజాగ్ కింగ్స్ చేతిలో.. రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పంజాకు కోల్‌కతా కుదేలైంది. మూడుసార్లు ఛాంపియన్ అయిన కేకేఆర్ వరుస ఓటములకు కెప్టెన్ అజింక్యా రహానే స్ట్రయిక్ రేటు ఓ కారణమని విమర్శలు వస్తున్నాయి. దాంతో.. తనపై అనవసరంగా కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని వాపోతున్నాడు రహానే.
“Let them talk”
Ajinkya Rahane isn’t worried about the strike-rate criticism pic.twitter.com/Phe7az0dEp
— ESPNcricinfo (@ESPNcricinfo) April 3, 2026
‘నా స్ట్రయిక్రేటుపై కొందరు విమర్శలు చేస్తున్నారు. కానీ, ఇప్పటివరకూ నేను గొప్పగా ఆడుతున్నా. 2023 సీజన్ నుంచి స్ట్రయిక్ రేటు ఎంతో మెరుగైంది. నా గురించి చెత్త మాట్లాడేవాళ్లు నా ఆట చూడడం లేదు కావవచ్చు లేదా ఉద్దేశపూర్వకంగా నన్ను లక్ష్యంగా చేసుకుని ఉండవచ్చు. అలాంటి వాళ్లకు నేను ఆడడం నచ్చదు. నా ఆట చూడడం వాళ్లకు ఇష్టముండదు. నేను సాధించిన విజయాలు చూసి వాళ్లు అసూయ పడుతున్నారు. వాళ్ల మాటలకు నేను ఆందోళన చెందడం లేదు.
— ESPNcricinfo (@ESPNcricinfo) April 3, 2026
నేను దూకుడుగానే ఆడాలనుకుంటా. అయితే కొన్నిసార్లు బ్యాటర్లకు చెలరేగే అవకాశం రాదు. దూకుడుగా ఆడలేం. నన్ను విమర్శించేవాళ్లు నేను మరోలా ఆడాలని ఆశిస్తున్నారు. రహానే తన ఆటను ఇంతలా మెరుగుపరచుకోవడం వాళ్లకు నచ్చడం లేదు. ఏదిమైనా కొందరు నా గురించి పాజిటివ్‌గా లేదా నెగెటివ్ ఏదో ఒకటి మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తోంది’ అని రహానే వెల్లడించాడు.
పవర్ ప్లేలో దూకుడుగా ఆడుతున్న రహానే ఆ తర్వాత అదే స్థాయిలో చెలరేగలేకపోతున్నాడనేది నిజం. గత కొన్ని మ్యాచుల్లో అతడి ప్రదర్శనను గమనిస్తే ఆ విషయం రూఢీ అవుతుంది. పవర్ ప్లేలో 167.8 స్ట్రయిక్ రేటు, 69 సగటుతో 552 పరుగులు చేసిన రహానే.. ఆరు ఓవర్ల తర్వాత 130 స్ట్రయిక్ రేటుకే పరిమితయ్యాడు.
KKR fans, is Ajinkya Rahane’s post-powerplay numbers worrying? pic.twitter.com/1JN7IFkwRj
— ESPNcricinfo (@ESPNcricinfo) April 3, 2026
సగటు మరీ దారుణంగా 17.8గా ఉండగా 481 పరుగులు చేశాడంతే. పంతొమ్మిదో సీజన్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians)పై అర్ధ శతకం(67)తో మెరిసిన రహానే సన్‌రైజర్స్‌పై మాత్రం 8 పరుగులకే ఔటయ్యాడు.