మట్టికోట మహరాజు రఫేల్ నాదల్ తనకు అచ్చొచ్చిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో నేడు కాస్పర్ రూడ్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. తొలి సెమీఫైనల్లో జ్వెరెవ్ గాయం కారణంగా అర్ధాంతరంగా వైదొలగడంతో నాదల్ సెమీస్‌కు చేరగా.. మరో సెమీస్‌లో రూడ్ 3-6, 6-4, 6-2, 6-2తో సిలిచ్‌పై నెగ్గి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఎవరికీ సాధ్యం కాని విధంగా ఇప్పటి వరకు ఫ్రెంచ్ ఓపెన్‌లో 13 సార్లు విజేతగా నిలిచిన నాదల్.. పద్నాలుగో టైటిల్ చేజిక్కించుకోవాలని తహతహలాడుతుండగా.. నాదల్కు చెక్ పెట్టాలని రూడ్ కృతనిశ్చయంతో ఉన్నాడు. పురుషుల సింగిల్స్ చరిత్రలో అత్యధికంగా 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన నాదల్.. ఆ సంఖ్యను 22కు పెంచుకోవడం ఖాయంగానే కనిపిస్తున్నది!