GT vs SRH | ఒక్కరూ నిలబడలే.. సంచలన విజయంతో టేబుల్ టాపర్‌గా గుజరాత్..!
GT vs SRH : బ్యాటర్ల విధ్వంసంతో బోర్ కొడుతున్న పంతొమ్మిదో సీజన్లో బౌలర్లు తమ హవా చూపించారు. అహ్మదాబాద్‌లో పచ్చిక వికెట్ మీద నిప్పులు చెరిగాడు రబడ(3-28). సన్‌రైజర్స్ హైదరాబాద్ హిట్టర్లను క్రీజులో నిలవనీయని ఈ స్పీడ్‌స్టర్ గుజరాత్ విజయంలో కీలకమయ్యాడు.
GT vs SRH : బ్యాటర్ల విధ్వంసంతో బోర్ కొడుతున్న పంతొమ్మిదో సీజన్లో బౌలర్లు తమ హవా చూపించారు. అహ్మదాబాద్‌లో పచ్చిక వికెట్ మీద నిప్పులు చెరిగాడు రబడ(3-28). 169 పరుగుల ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ హిట్టర్లను క్రీజులో నిలవనీయని ఈ స్పీడ్‌స్టర్ గుజరాత్ విజయంలో కీలకమయ్యాడు. హోల్డర్(3-20) ఓ చేయి వేస్తూ ఒకే ఓవర్లో క్లాసెన్(14), నితీశ్ రెడ్డి(2)లను ఔట్ చేసి సన్‌రైజర్స్ ఓటమిని ఖాయం చేశాడు. కమిన్స్(19) పోరాడినా.. అవతలి ఎండ్‌లో ఆడేవారు కరువవ్వగా అగ్రస్థానాన్ని గుజరాత్‌కు కట్టబెట్టింది హైదరాబాద్.
పంతొమ్మిదో సీజన్లో బ్యాటర్ల ఊచకోతకు బలైతున్న బౌలర్లు చాలామంది. వరల్డ్‌క్లాస్ పేసర్లు సైతం భారీగా పరుగులు సమర్పిస్తున్న వేళ.. గుజరాత్ టైటాన్స్ స్పీడ్‌స్టర్ రబడ(3-28) నేను బ్యాటర్లను భయపెట్టగలను అని నిరూపించాడు. అహ్మదాబాద్ మైదానంలో గుజరాత్‌ను కట్టడిచేసిన సంతోషంలో ఇన్నింగ్స్ ఆరంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టాపార్డర్‌ను రబడ కకావికలం చేశాడు. సిరాజ్ పేస్ ధాటికి ఓపెనర్ ట్రావిస్ హెడ్(0) ఇంప్యాక్ట్ చూపకుండానే వెనుదిరిగాడు. ఆ తర్వాత బంతి అందుకున్న రబడ.. విధ్వంసక అభిషేక్ శర్మ(6), ఇషాన్ కిషన్(11)లు ఆచితూచి ఆడి ఇన్నింగ్స్ నిర్మిస్తారనుకుంటే.. రబడ ఓవర్లో సిక్సర్ బాదిన అభిషేక్ అనూహ్యంగా తర్వాతి బంతిని వికెట్ల మీదకు ఆడుకున్నాడు. ఇషాన్ వికెట్ కీపర్ బట్లర్ చేతికి చిక్కాడు.
You say Impact 🗣️
We hear Jason Holder 😎
It’s all #GT at the moment in Ahmedabad 🙌
Updates ▶️ https://t.co/o2tKKCeEaH#TATAIPL | #KhelBindaas | #GTvSRH | @gujarat_titans pic.twitter.com/x4uU3Z0VB8
— IndianPremierLeague (@IPL) May 12, 2026
చూస్తుండగానే మూడు వికట్లు పడిన వేళ.. స్మరన్ రచిచంద్రన్(9), హెన్రిచ్ క్లాసెన్(14)లు ఆచితూచి ఆడారు. పవర్ ప్లే చివరి ఓవర్లో సిరాజ్ క్యాచ్ వదిలేసినా.. సద్వినియోగం చేసుకోలేక గిల్‌కు సులువైన క్యాచ్ ఇచ్చేశాడు. టాపార్డర్ విఫలమైనా క్లాసెన్, సలీల్ అరోరా(16), నితీశ్ రెడ్డి(2) జట్టును ఆదుకోవాలనుకున్నారు. కానీ, ఇంప్యాక్ట్ సబ్ ప్రసిధ్ కృష్ణ(2-23) ఓవర్లో సలీల్ వెనుదిరగగా.. హోల్డర్ 11వ ఓవర్లో క్లాసెన్, నితీశ్‌లను ఔట్ చేసి మ్యాచ్‌ను గుజరాత్ వైపు తిప్పాడు. 60 పరుగులకే ఏడు వికెట్లు పడిన వేళ.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్(19), శివాంగ్ కుమార్ (4)లు కాసేపు పోరాడారు. ప్రఫుల్ హింగేను రషీద్ ఔట్ చేయగా 86కే హైదరాబద్ ఇన్నింగ్స్ ముగిసింది. 82 పరుగుల తేడాతో గెలుపొందిన గుజరాత్ టేబుల్ టాపరైంది.
A hit no one saw coming! 😍🔥
Much to the oohs and aahs of the bowlers and fielders, Pat Cummins unleashes a massive hit into the stands! 🙌#TATAIPL Race To Playoffs 2026 ➡️ #GTvSRH | LIVE NOW 👉https://t.co/mPjP1tWrsI pic.twitter.com/U4uKJiWP6s
— Star Sports (@StarSportsIndia) May 12, 2026
రాణించిన సుదర్శన్, సుందర్
టాస్ ఓడిన గుజరాత్ టైటాన్స్‌ను పవర్ ప్లేలో సన్‌రైజర్స్ పేసర్లు వణికించారు. ఉప్పల్ హీరో ప్రఫుల్ హింగే(2-17) రెండు వికెట్లతో బ్రేకివ్వగా గుజర్తా ఇన్నింగ్స్ నత్తనడకను తలపించింది. తొలుత హింగో ఓవర్లో శుభ్‌మన్ గిల్(5) మిడ్ వికెట్లో ఆడిన బంతిని క్లాసెన్ డైవింగ్ క్యాచ్ పట్టాడు. ఆపై స్పూప్ షాట్ ఆడాలనుకున్న బట్లర్(7) వికెట్ కీపర్ ఇషాన్ చేతికి చిక్కాడు. అనంతరం.. నిశాంత్ సింధు(22), ఓపెనర్ సాయి సుదర్శన్(61) కీలక భాగస్వామ్యంతో ఆదుకునే ప్రయత్నం చేశారు.

కానీ, ఈసారి కమిన్స్, క్లాసెన్ జోడీ సింధును వెనక్కి పంపింది. అంతే.. 64కే మూడు కీలక వికెట్లు పడ్డాయి. ఆ దశలో సుందర్(50) జతగా సుదర్శన్ జట్టును గట్టెక్కించే ఇన్నింగ్స్ ఆడాడు. అర్ధ శతకంతో గుజరాత్‌కు మంచి స్కోరందించాలనుకున్న సుదర్శన్‌ను షకీబ్ వెనక్కి పంపాడు. డెత్ ఓవర్లలో ధాటిగా ఆడిన సుందర్ మలింగ బౌలింగ్‌లో ఫైన్ లెగ్‌లో 4, 6 బాదాడు. చివరి ఓవర్లో షకీబ్ రన్సే ఇవ్వడంతో హైదరాబాద్‌కు లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
‘పంచాయతీల సమస్యలను పరిష్కరించాలి’
‘కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి కోదాడ పబ్లిక్ క్లబ్‌కు తీరని లోటు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

