చెన్నై: ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్)లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ వరుస ఓటముల పరంపర దిగ్విజయం కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన లీగ్ మ్యచ్‌లో హైదరాబాద్ 6-15, 11-15, 12-5తో బెంగళూరు టార్పడోస్ చేతిలో ఓటమిపాలైంది. గ్రూపు దశలో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌కు ఇది ఆరో ఓటమి కావడం విశేషం.
హైదరాబాద్‌పై విజయంతో బెంగళూరు సూపర్-5 ఆశలను సజీవంగా నిలుపుకుంది. మరోవైపు ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన బ్లాక్‌హాక్స్ నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది. బెంగళూరు ప్లేయర్ సేతు మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించాడు. బ్లాక్‌హాక్స్ ఆటగాడు సాహిల్కుమార్ సూపర్ స్పైక్‌లతో ఎదురుదాడికి ప్రయత్నించగా, శ్రాజన్ శెట్టి(బెంగళూరు) నెట్ దగ్గర కండ్లు చెదిరే బ్లాక్‌లతో ఆకట్టుకున్నాడు.