Japan Open : ఒలింపిక్ విజేత పీవీ సింధు (PV Sindhu) రెండేళ్ల నిరీక్షణ ఫలించింది. వరసగా నిరాశ పరుస్తున్న తెలుగుతేజం జపాన్ ఓపెన్ (Japan Open 2026) ఫైనల్లో అడుగుపెట్టింది. లక్ష్యసేన్, ఆయుశ్ శెట్టిలు తేలిపోయిన చోట భారత పతకం ఆశలు మోస్తున్న సింధు సెమీఫైనల్లో అదిరే విజయంతో టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. సెమీస్‌లో చెన్ యూఫీ (Chen Yufei)ని చిత్తు చేసి ఈ మెగా టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్ చేరిన తొలి భారత షట్లర్‌గా చరిత్ర సృష్టించింది. అంతేకాదు ఈ మధ్య కాలంలో పరాజయాలతో విసిగిపోయిన భారత షట్లర్ 2024 తర్వాత తొలి ఫైనల్ ఆడబోతోంది.
మహిళల సింగిల్స్‌లో ఒకప్పటిలా టైటిళ్లు గెలవలేకపోతున్న పీవీ సింధు ఎట్టకేలకు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ రెండేళ్ల కాలంలో అయితే.. క్వార్టర్స్ లేదంటే తొలి రౌండ్లోనే వెనుదిరిగిన సింధు జపాన్ ఓపెన్‌లో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. శనివారం జరిగిన సెమీస్‌లో చెన్ ఫీ(చైనా)పై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది.
మొదటి సెట్‌ను 21-19తో గెలుచుకున్న సింధు.. రెండో సెట్లోనూ జోరు చూపించింది. 15-10తో భారత షట్లర్ ఆధిక్యంలో ఉండగా చెన్ కండరాల గాయంతో ఇబ్బంది పడింది. తాను ఆట కొనసాగించలేకపోవడంతో తెలుగు తేజం ఫైనల్‌కు అర్హత సాధించింది. మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి లోనైంది సింధు.
SINDHU CREATES HISTORY | Enters Final
As 🇨🇳 Chen Y F retires mid match while trailing, Indian queen becomes first Indian WS player to enter #JapanOpen Finals pic.twitter.com/7apthukpmT
— IndiaSportsHub (@IndiaSportsHub) July 18, 2026
‘ఫైనల్‌కు చేరడం చాలా సంతోషంగా ఉంది. ఈ టోర్నీలో ప్రతి మ్యాచ్‌ను చాలా ముఖ్యమైనదిగా భావించాడు. ఈరోజు మ్యాచ్ మరింత కీలకం కాబట్టి.. మొదటి నుంచి ఫోకస్‌గా ఆడాను. ఎందుకంటే.. టాప్ ర్యాంకర్లను ఓడించాలంటే ప్రతి పాయింట్ చాలా ముఖ్యం’ అని ఆమె పేర్కొంది. రెండో సెమీఫైనల్ ఆడనున్న అకనే యమగుచి(జపాన్), పుత్రి కుసుమ వర్దానీ(ఇండోనేషియా)లలో ఒకరిని ఆదివారం జరుగబోయే టైటిల్ పోరులో సింధు ఢీకొట్టనుంది.
🇮🇳 PV Sindhu enters Japan Open final 🏆
She faced Tokyo Olympics champion Chen Yufei of China in the women’s singles semifinal, who retired midway through their match
▶️ Read more: https://t.co/3ycAniRrRo pic.twitter.com/fGD2MaRSsA
— ESPN India (@ESPNIndia) July 18, 2026