న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన డ్యాన్స్ ట్యాలెంట్‌ను చూపించింది. దీపావళి పండగ వేళ ఓ పాటకు స్టెప్పులేసింది. సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో తన నృత్యానికి చెందిన ఓ వీడియోను పోస్టు చేసింది. పాప్ సింగర్ సీకేకు చెందిన లవ్ వాంటిటి సాంగ్‌కు సిందు చిందులేసింది. నిజానికి ఈ పాట ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. కంచీపురం లెహెంగా వేసుకున్న సింధు.. చాలా కూల్‌గా ఆ పాటకు తగ్గట్లు మూమెంట్స్ ఇచ్చింది. ఎంతో తన్మయత్వంతో ఆ పాటను షట్లర్ సింధు ఎంజాయ్ చేసింది. ఆమె షేర్ చేసిన డ్యాన్స్ వీడియోకు తెగ లైక్స్ వచ్చేశాయి. ఒక్క రోజులోనే ఆ పోస్టుకు 12 లక్షల వ్యూవ్స్ వచ్చాయి. ఇక ఆ పాటకు ట్రెడిషనల్, డ్యాన్స్, లవ్, మ్యూజిక్, డ్యాన్స్లవ్ లాంటి హ్యాష్‌ట్యాగ్‌లను ఆమె పోస్టు చేసింది. బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్‌తో పాటు రియో, టోక్యో ఒలింపిక్స్‌లో మెడల్స్ సాధించిన సింధుకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. ఆ అవార్డును సోమవారం రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా ఆమె అందుకున్న విషయం తెలిసిందే. రాబోయే టోర్నీల్లో తప్పకుండా మేటి ప్రదర్శన ఇస్తానని సింధు చెప్పింది.
https://www.instagram.com/reel/CV-HAB7gmZN/?utm_source=ig_web_copy_link