Wasim Jaffer | పూజారా బాజ్‌బాల్ కాగలడు.. కానీ, బాజ్‌బాల్ పూజారా కాలేదు : వసీం జాఫర్
మెక్కల్లమ్ ఇంగ్లండ్ జట్టు హెడ్ కోచ్ అయ్యాక బాజ్‌బాల్ పదం వాడుకలోకి వచ్చింది
Wasim Jaffer : బంగ్లాదేశ్‌తో రెండో ఇన్నింగ్స్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన ఛతేశ్వర్ పూజారాపై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తన సహజ స్వభావానికి విరుద్ధంగా ఆడిన అతను కేవలం 130 బంతుల్లోనే శతకం సాధించాడు. దాంతో పూజారాపై మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఆసక్తికర కామెంట్లు చేశాడు. యారా ఓ యారా.. లారాను చూసి ఇన్స్పైర్ అయ్యాడేమో.. పూజారా బాజ్‌బాల్ కాగలడు. కానీ బాజ్‌బాల్ పూజారా కాలేదు అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. పూజారాపై సోషల్ మీడియాలోనూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పూజారా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 90 పరుగులకు అవుట్ అయ్యాడు. మూడు సంవత్సరాలుగా శతకం కోసం నిరీక్షిస్తున్న అతను రెండో ఇన్నింగ్స్‌లో ఏ పొరపాటు చేయలేదు. బంగ్లా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ తన పరుగుల దాహం తీర్చుకున్నాడు. బ్రెండన్ మెక్కల్లమ్ ఇంగ్లండ్ జట్టు హెడ్ కోచ్ అయ్యాక బాజ్‌బాల్ అనే పదం వాడుకలోకి వచ్చింది. అతడిని అందరూ ముద్దుగా బాజ్ అని పిలుస్తారు. అతని సలహాలతో ఇంగ్లండ్ జట్టు టెస్టుల్లో వేగంగా ఆడడం అలవర్చుకుంది.
నెమ్మదిగా ఆడతాడు.. స్ట్రైక్ రేట్ చాలా తక్కువ ఉంటుందని పూజారాను కొందరు విమర్శిస్తుంటారు. వాళ్ల మాటలకు చెక్ పెడుతూ రెండో ఇన్నింగ్స్‌లో పూజారా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 87 బంతుల్లో అర్థ సెంచరీ చేసిన అతను సెంచరీకి చేరుకునేందుకు 43 బంతులు మాత్రమే తీసుకున్నాడు. టెస్టుల్లో అతనికి ఇది 19వ శతకం. 258 రన్స్ వద్ద కేఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 42 రన్స్ చేసింది. ఆ జట్టు విజయం సాధించాలంటే రెండు రోజుల్లో 471 పరుగులు చేయాలి. అయితే.. భారత బౌలర్ల ధాటికి బంగ్లా ఆటగాళ్లు తట్టుకుంటారా? అనేది వేచి చూడాలి. తొలి ఇన్నింగ్స్‌లో పేసర్ సిరాజ్3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీసి బంగ్లాను దెబ్బకొట్టారు. ఉమేశ్ యాదవ్, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ తీశారు.
Yaara o yaara
Inspired by Lara
Pujara can Bazball
Bazball can’t Pujara 😉 #BANvIND pic.twitter.com/pAsjz8wciR— Wasim Jaffer (@WasimJaffer14) December 16, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

