PSL 2024 | ఇస్లామాబాద్‌దే పీఎస్ఎల్ ట్రోఫీ.. ముల్తాన్ సుల్తాన్స్పై ఉత్కంఠ విజయం
PSL 2024 | ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన ఫైనల్లో ఇస్లామాబాద్.. 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఆఖరి బంతి దాకా విజయం కోసం ఇరు జట్లూ పోరాడగా.. చివరి బంతికి సింగిల్ తీసిన ఇస్లామాబాద్ ఈ లీగ్‌లో మూడో ట్రోఫీ కొట్టింది.
PSL 2024 | పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2024 సీజన్ ట్రోఫీని ఇస్లామాబాద్ యునైటెడ్ సొంతం చేసుకుంది. సోమవారం ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన ఫైనల్లో ఇస్లామాబాద్.. 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఆఖరి బంతి దాకా విజయం కోసం ఇరు జట్లూ పోరాడగా.. చివరి బంతికి సింగిల్ తీసిన ఇస్లామాబాద్ ఈ లీగ్‌లో మూడో ట్రోఫీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేయగా ఇస్లామాబాద్.. 20వ చివరి బంతికి ఫోర్ కొట్టి ఘనవిజయాన్ని అందుకుంది.
కరాచీ వేదికగా ముగిసిన ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన ముల్తాన్.. బ్యాటింగ్‌లో విఫలమైంది. ఆ జట్టు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (26) తో పాటు ఓపెనర్ యాసిర్ ఖాన్, విల్లేలు విఫలమయ్యారు. ఉస్మాన్ ఖాన్ (57) అర్థ సెంచరీతో రాణించగా ఆఖర్లో ఇఫ్తికార్ అహ్మద్ (20 బంతుల్లో 32, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో ముల్తాన్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇస్లామాబాద్ బౌలర్లలో ఇమాద్ వసీం ఐదు వికెట్లతో ముల్తాన్ వెన్నువిరవగా.. సారథి షాదాబ్ ఖాన్ మూడు వికెట్లు తీశాడు.
అనంతరం మోస్తారు ఛేదనలో ఇస్లామాబాద్ కూడా తడబడింది. కొలిన్ మున్రో (17), అఘా సల్మాన్ (10), షాదాబ్ ఖాన్ (4)లు విఫలమయ్యారు. కానీ ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ (32 బంతుల్లో 50, 4 ఫోర్లు), అజామ్ ఖాన్ (30)లు రాణించడంతో ఇస్లామాబాద్ విజయం దిశగా సాగింది. కానీ కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టుకు చివరి ఓవర్లో 8 పరుగులు అవసరమయ్యాయి. తొలి బంతికి ఇమాద్ వసీం (19 నాటౌట్) సింగిల్ తీయగా రెండో బాల్‌కు నసీమ్ షా ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత రెండు బంతులకు రెండు పరుగులొచ్చాయి. కానీ ఐదో బాల్‌కు నసీమ్ ఔట్ అవగా.. ఆరో బంతికి నసీమ్ షా తమ్ముడు హునైన్ షా ఫోర్ కొట్టి ఇస్లామాబాద్‌కు మూడో ట్రోఫీని అందించాడు.
SHAH BROTHERS ARE TOTAL CLUTCH 🔥👌pic.twitter.com/cyOa0vK8xo
— Johns. (@CricCrazyJohns) March 18, 2024
— Islamabad United (@IsbUnited) March 18, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

