హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ ప్లేయర్ ప్ర ణీత్ ఉప్పాల గ్రాండ్‌మాస్టర్ నార్మ్‌కు మరింత చేరువయ్యాడు. స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన బియల్ అంతర్జాతీయ చెస్ ఫెస్టివెల్లో ప్రణీత్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మొత్తం తొమ్మిది రౌండ్ల పాటు జరిగిన టోర్నీలో ఈ 15 ఏండ్ల యువ ప్లేయర్ ఆరు పాయింట్లు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో రష్యా గ్రాండ్‌మాస్టర్ అలెక్సెంకో కిరిల్‌పై అనూహ్య విజయం సాధించిన ప్రణీత్.. యు యాంగుయి(చైనా)తో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. మరో ఇద్దరు గ్రాండ్మాస్టర్లతో గేమ్‌లను డ్రా గా ముగించుకున్న ప్రణీత్ 21 ఎలో రేటింగ్ పాయింట్లతో ఓవరాల్ రేటింగ్‌ను 2457కు పెంచుకున్నాడు. గత మార్చిలో ప్రణీత్ తొలి జీఎం నార్మ్ ఖాతాలో వేసుకున్నాడు.