పాఫోస్ (సైప్రస్) : ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద డ్రాల పరంపర ఏడో రౌండ్లోనూ కొనసాగింది. ఓపెన్ క్యాటగిరీలో హికారు నకముర (యూఎస్ఏ)తో కీలకమైన ఏడో రౌండ్ ఆడిన అతడు.. ఈ గేమ్నూ డ్రాగా ముగించాడు.
ఈ టోర్నీలో అతడికి ఇది వరుసగా నాలుగో డ్రా కావడం విశేషం. 12 రౌండ్లున్న ఈ టోర్నీలో 7 రౌండ్లు ముగిసేసరికి ప్రజ్ఞానంద్.. 3.5 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. మహిళల విభాగంలో వైశాలి.. టాన్ జోంగ్యి (చైనా)పై గెలిచి వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది.