Praggnanandhaa: 34 ఎత్తుల్లోనే గుకేశ్‌ను ఓడించిన ప్రజ్ఞానంద
Praggnanandhaa: నార్వే చెస్ టోర్నీలో ప్రజ్ఞానంద రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వరల్డ్ చాంపియన్ గుకేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను విక్టరీ కొట్టాడు. కేవలం 34 ఎత్తుల్లోనే గుకేశ్‌ను ఓడించాడు. ప్రజ్ఞానంద ప్రస్తుతం 15 పాయింట్లు సాధించాడు.
ఓస్లో: నార్వే చెస్ టోర్నీలో భారతీయ ప్లేయర్ ఆర్ ప్రజ్ఞానంద(Praggnanandhaa) దూసుకెళ్తున్నాడు. ఆ టోర్నీలో ప్రస్తుతం అతను రెండో స్థానంలో నిలిచాడు. అయితే వరల్డ్ చాంపియన్, మరో భారత ఆటగాడు డీ గుకేశ్‌పై అద్భుతమైన విజయాన్ని ప్రజ్ఞానంద నమోదు చేశాడు. కీలకమైన మ్యాచ్‌లో కేవలం 34 ఎత్తుల్లోనే గుకేశ్‌ను మట్టికరిపించాడు. రెండు రో్జుల క్రితమే గుకేశ్ తన 20వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. అయితే ఈ విక్టరీ ప్రజ్ఞానందకు ప్రతీకార విజయం అవుతుంది. ఈ టోర్నీలోనే నాలుగవ రౌండ్లో గుకేశ్ చేతిలో ప్రజ్ఞానంద ఓడిపోయారు. గుకేశ్‌పై గెలుపుతో టైటిల్ రేసుకు ప్రజ్ఞానంద చేరువయ్యారు. వరుసగా మూడు విక్టరీలతో మళ్లీ ఊపందుకున్నాడు.
మూడు రోజుల క్రితం వెనుకబడ్డ నేను ఇప్పుడు టైటిల్ రేసులో ఉన్నట్లు ప్రజ్ఞానంద తెలిపారు. గత ఏడాది నార్వే చెస్ టోర్నీలో గుకేశ్, కార్ల్సన్ మధ్య తీవ్ర పోటీ ఉండే. అయితే ఈ ఏడాది కార్ల్సన్ పెద్దగా పర్ఫార్మ్ చేయలేకపోయాడు. గుకేశ్‌కు 8 పాయింట్లు ఉన్నాయి. పాయింట్ల పట్టికలో వెస్లే అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 15.5 పాయింట్లతో దూసుకెళ్తున్నాడు. ప్రజ్ఞానంద 15 పాయింట్లతో టైట్ ఫైట్ ఇస్తున్నాడు. ఇక మూడవ స్థౄనంలో 14.5 పాయింట్లతో అలిరెజా ఫిరౌజా ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

