హోరాహోరీగా..
ఫిఫా ప్రపంచకప్ ఆసాంతం ఆసక్తికరంగా సాగుతున్నది. టైటిల్‌పై కన్నేసిన జట్లు ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ ముందుకు సాగుతున్నాయి.
- ఉరుగ్వేపై పోర్చుగల్ అద్భుత విజయం
- ప్రిక్వార్టర్స్‌లో సెనెగల్, నెదర్లాండ్స్
- ఖతార్, ఈక్వెడార్ నిష్క్రమణ
- ఫిఫా ప్రపంచకప్
ఫిఫా ప్రపంచకప్‌లో నిష్క్రమణల పర్వం మొదలైంది. నాకౌట్ సమయం సమీపిస్తున్న వేళ ప్రతీ మ్యాచ్ కీలకమవుతున్నది. ఉరుగ్వేకు పోర్చుగల్ చెక్ పెడితే.. ఈక్వెడార్‌ను ఓడిస్తూ సెనెగల్ ముందంజ వేసింది. ఆతిథ్య ఖతార్ ఆశలపై నీళ్లు గుమ్మరిస్తూ నెదర్లాండ్స్ ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించగా, పోలాండ్‌తో అర్జెంటీనా అమీతుమీకి సిద్ధమైంది.
లుసైల్(ఖతార్): ఫిఫా ప్రపంచకప్ ఆసాంతం ఆసక్తికరంగా సాగుతున్నది. టైటిల్‌పై కన్నేసిన జట్లు ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ ముందుకు సాగుతున్నాయి. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన జట్లకు షాక్‌లు తగులుతుంటే అసలు ఇవి పోటీనిస్తా యా అనుకున్న టీమ్‌లు చెలరేగిపోతున్నాయి. ఉరుగ్వేతో జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్ 2-0తో అద్భుత విజయం సాధించింది. కెరీర్లో ఆఖరి ప్రపంచకప్ ఆడుతున్న స్టార్ స్ట్రైకర్ క్రిస్టియానో రొనాల్డో మరోమారు జట్టును ముందుండి నడిపించాడు.
దాడులకు నాయకత్వం వహిస్తూ సహచరుల్లో స్ఫూర్తి నింపాడు. మ్యాచ్ తొలి అర్ధభాగం గోల్ లేకుండా ముగియగా, ద్వితీయార్థంలో బ్రూనో ఫెర్నాండెజ్ (54ని, 90+ని) డబుల్ గోల్స్ చేశాడు. మ్యాచ్ 54వ నిమిషంలో ఫెర్నాండెజ్ కొట్టిన బంతి రొనాల్డో నెత్తిని తాకి తాకనట్లు గోల్‌పోస్ట్‌లోకి వెళ్లింది. గోల్ చేసిన ఆనందంలో రొనాల్డో సంబురాల్లో మునిగిపోయాడు. అయితే పలుమార్లు రివ్యూను పరిశీలించిన రిఫరీలు రొనాల్డోకు కాకుండా ఫెర్నాండెజ్‌కు గోల్ కేటాయించారు. దీంతో ఉరుగ్వేపై విజయంతో.. ఫ్రాన్స్, బ్రెజిల్ తర్వాత ప్రిక్వార్టర్స్ చేరిన ఫేవరెట్‌గా పోర్చుగల్ నిలిచింది.
నాకౌట్‌కు సెనెగల్, నెదర్లాండ్స్
గ్రూపు-ఎలో సెనెగల్, నెదర్లాండ్స్ ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాయి. మంగళవారం జరిగిన వేర్వేరు మ్యాచ్‌ల్లో సెనెగల్ 2-1తో ఈక్వెడార్‌పై విజయం సాధించింది. సెనెగల్ తరఫున ఇస్మాయిల సార్ (44ని), కలీదు కౌలిబెలి (70ని) గోల్స్ చేశారు. మరో పోరులో నెదర్లాండ్స్ 2-0తో ఖతార్‌ను ఓడించింది. నెదర్లాండ్స్ జట్టుకు క్యాడీ గాక్పో (26ని), ఫ్రెంకీ డీ జాంగ్ (49ని) గోల్స్ అందించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

