ప్రస్తుతం లెజెండ్స్ క్రికెట్ లీగ్ ఆడుతున్న సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ కెవిన్ పీటర్సన్.. భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సాధారణంగానే ఎడమచేతి వాటం స్పిన్ బౌలింగ్ ఆడటం కష్టమని, కానీ యువరాజ్ బౌలింగ్‌లో ఆడటం మరింత ఇబ్బందిగా ఉండేదని చెప్పాడు.
ఇప్పటికీ యువరాజ్ బౌలింగ్ ఆడటం కష్టమేనన్నాడు. లెజెండ్స్ క్రికెట్ లీగ్ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో విడుదలైన వీడియోలో కెవిన్ పీటర్సన్ ఈ కామెంట్స్ చేశాడు. తొలిసారి యువీ బౌలింగ్‌కు వచ్చినప్పుడు, స్కోర్ చేయడానికి మంచి అవకాశం అనుకున్నానని, కానీ అతను తనను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడని కేపీ గుర్తుచేసుకున్నాడు.
యువీ బౌలింగ్‌లో తనకు నచ్చిన షాట్ ఫార్వర్డ్ డిఫెన్సివ్ బ్లాక్ అన్నాడు. ఈ షాట్‌తో యువీ నుంచి తప్పించుకోవచ్చన్నాడు. అదే సమయంలో యువీ తనకు చాలా మంచి స్నేహితుడుని, అతని గురించి అన్నీ తనకు నచ్చుతాయని చెప్పాడు.