BCCI Meeting: పాండ్యాను కాదని సూర్యకు కెప్టెన్సీ. . బీసీసీఐ మీటింగ్‌లో ఏం జరిగింది.. ప్లేయర్ల అభిప్రాయం తీసుకున్నారా?
BCCI Meeting: పాండ్యాను కాదని సూర్యకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు బీసీసీఐ ఆటగాళ్ల అభిప్రాయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ మంది ప్లేయర్లు సూర్యకు ఓటేసినట్లు ఓ మీడియా కథనాన్ని రాసింది. పాండ్యా కన్నా సూర్యనే బెటర్ అని ఆటగాళ్లు పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ముంబై: శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు భారత కెప్టెన్సీ బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్‌కు అప్పగించారు. తొలుత హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలు దక్కే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చినా.. చివరకు సూర్యకుమార్ యాదవ్‌కు బీసీసీఐ మొగ్గుచూపింది. లంకతో జరిగే టీ20 సిరీస్‌కు పాండ్యాను ఎంపిక చేసినా.. కనీసం అతనికి వైస్ కెప్టెన్సీ కూడా ఇవ్వలేదు. బీసీసీఐ సెలక్షన్ మీటింగ్(BCCI Meeting)లో ఏం జరిగిందన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
టీ20 వరల్డ్‌కప్ తర్వాత రోహిత్ శర్మ .. ఆ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో సారథ్య బాధ్యతలను హార్ధిక్ పాండ్యాకు అప్పగిస్తారనుకున్నారు. కానీ కొత్త కోచ్ గౌతం గంభీర్ తనదైన స్టయిల్లో సెలెక్షన్ విధానాన్ని కొనసాగించారు. ఫిట్నెస్ ఇష్యూ వల్ల పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వలేదని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఓ మీడియా రిపోర్టు ప్రకారం.. భారత జట్టు ఆటగాళ్లు చాలా వరకు సూర్యకుమార్‌పై తమ విశ్వాసాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పాండ్యా కావాలా.. సూర్య కావాలా అని బీసీసీఐ ప్రతి ప్లేయర్ వద్ద ఓపీనియన్ తీసుకున్నట్లు కొన్ని కథనాలు చెబుతున్నాయి.
పాండ్యా కన్నా ఎక్కువగా సూర్యను ప్లేయర్లు నమ్మినట్లు బీసీసీఐ ఫీడ్‌బ్యాక్ ద్వారా తెలిసింది. సూర్య కెప్టెన్సీ కింద తాము కంఫర్ట్‌గా ఉంటామని ఆటగాళ్లు పేర్కొన్నారు. రెండు రోజుల పాటు సెలెక్షన్ కమిటీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్‌లో చాలా వరకు సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినట్లు తెలుస్తోంది. మేనేజ్మెంట్ లాంగ్ టర్మ్ ప్లాన్స్‌కు చెంది ఆటగాళ్లు ఫోన్లు వెళ్లినట్లు ఓ రిపోర్టు ద్వారా వెల్లడైంది.
సూర్యకుమార్ యాదవ్ మేనేజ్మెంట్ స్కిల్స్ బీసీసీఐ సెలెక్టర్లను ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఇషాన్ కిషన్ మధ్యలో వెళ్లిపోతున్న సమయంలో.. అతన్ని యాదవ్ కన్విన్స్ చేసినట్లు తెలుస్తోంది. సూర్య కమ్యూనికేషన్ స్టయిల్ రోహిత్ తరహాలో ఉంటుందని, ఆటగాళ్లు అతనితో చర్చించేందుకు వెనుకాడరని రిపోర్టులో తెలిసింది.
ఇటీవల పాండ్యా పదేపదే గాయాలతో టీ20లకు దూరం అయ్యాడు. 2022 జనవరి ఒకటో తేదీ నుంచి జరిగిన 79 టీ20ల్లో అతను కేవలం 46 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇదే సమయంలో సూర్యకుమార్ హెర్నియా వల్ల కొన్ని మ్యాచ్‌లు మాత్రమే మిస్సయ్యాడు. శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్‌కు శుభమన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- BCCI
- captain
- hardik pandya
- odi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

