Pele | పీలే ఆరోగ్యం క్షీణించింది.. మూత్రపిండాలు, గుండెపైనా ప్రభావం.. అల్బర్ట్ ఐన్‌స్టీన్ వైద్యులు
శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్తో నవంబర్ నుంచి ఆస్పత్రిలోనే పీలే
Pele : లెజెండరీ ఫుట్‌బాల్ అటగాడు పీలే ఆరోగ్యం క్షీణించిందని ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు వెల్లడించారు. క్యాన్సర్ మందుల మోతాదును తగ్గించే క్రమంలో పీలే ఆరోగ్యం క్షీణించిందని బ్రెజిల్‌లోని అల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ‘పీలేకు క్యాన్సర్ అడ్వాన్స్‌డు స్టేజ్‌లో ఉందని, గుండె, మూత్రపిండాల పనితీరు దెబ్బతినడంతో ఆయన ప్రత్యేక పర్యవేక్షణలో ఉన్నార’ని డాక్టర్లు చెప్పారు. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్ రావడంతో సావో పౌలోలో ఉన్న అల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆస్పత్రిలో చేరారు. పీలే నవంబర్ నెల నుంచి ఆయన అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. దాంతో ‘ఇంటివద్ద నిర్వహించాలనుకున్న క్రిస్మస్ వేడుకలను రద్దు చేసుకున్నాం’ అని పీలే కుమార్తె కెలి నసిమెంటో తెలిపింది.
పీలేకు ప్రస్తుతం 82 ఏళ్లు. ఆయనకు పెద్దపేగు క్యాన్సర్ వచ్చింది. దాంతో 2021 సెప్టెంబర్‌లో ఆపరేషన్ చేసి క్యాన్సర్ కణితిని తొలగించారు. అయినా కూడా ఆయన క్యాన్సర్ మందులు వాడుతున్నారు. అయితే.. క్యాన్సర్ ఇతర శరీర భాగాలకు సోకిందా? లలేదా? అనేది ఆస్పత్రి వర్గాలు గానీ, పీలే కుటుంబసభ్యులు గానీ వెల్లడించలేదు. పీలే సారథ్యంలో మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. 1958, 1962,1970లో బ్రెజిల్ ఫిఫా వరల్డ్ కప్ అందుకుంది. తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న పీలే గొప్ప ఫుట్‌బాలర్‌గా నీరాజనాలు అందుకున్నాడు.
ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన అర్జెంటీనాకు పీలే శుభాకాంక్షలు తెలియజేశాడు. అంతేకాదు మెస్సీ, ఎంబాపేలను మెచ్చుకున్నాడు. ‘ఈరోజు ఫుట్‌బాల్ తన కథను సరికొత్తగా చెప్పింది. ఫుట్‌బాల్ ఆటలోని మజాను పంచిన ఇలాంటి గొప్ప మ్యాచ్‌ను చూడడం నిజంగా పెద్ద బహుమానం’ అంటూ వరల్డ్ కప్ ఫైనల్ అనంతరం పీలే కామెంట్ చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

