Paris Olympics | ఈ నెల 26 నుంచి పారిస్ ఒలింపిక్స్.. కేంద్రం ఏ క్రీడకు ఎక్కువ ఖర్చు చేసిందో తెలుసా..?
Paris Olympics | ఈ ఒలింపిక్స్ క్రీడల సన్నద్ధత కోసం భారత ప్రభుత్వం భారీగా ఖర్చు చేసింది. ప్రధాన క్రీడల కోసం ఏకంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏ క్రీడల కోసం ఎంత ఖర్చు పెట్టింది..? అన్నింటికంటే ఎక్కువగా ఏ క్రీడల కోసం ఖర్చు చేసింది అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Paris Olympics : ఈ నెల 26 నుంచి ఫ్రాన్స్ (France) రాజధాని పారిస్ (Paris) లో ‘2024 ఒలింపిక్ క్రీడలు (Olympics – 2024) జరగనున్నాయి. ఇంచుమించుగా నెలరోజులపాటు జరగనున్న ఈ క్రీడలు ప్రపంచ క్రీడాభిమానులకు కనువిందు చేయనున్నాయి. ఈ ఒలింపిక్స్ క్రీడల సన్నద్ధత కోసం భారత ప్రభుత్వం భారీగా ఖర్చు చేసింది. ప్రధాన క్రీడల కోసం ఏకంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టింది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏ క్రీడల కోసం ఎంత ఖర్చు పెట్టింది..? అన్నింటికంటే ఎక్కువగా ఏ క్రీడల కోసం ఖర్చు చేసింది అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా కేంద్ర సర్కారు అన్ని క్రీడల కంటే ఎక్కువగా అథ్లెటిక్స్‌కు ఖర్చు చేసింది. అథ్లెటిక్స్ కోసం ఏకంగా రూ.96.08 కోట్లు ఖర్చు పెట్టింది. ఆ తర్వాత అత్యధికంగా బ్యాడ్మింటన్ కోసం భారత్ ఖర్చు చేసింది. బ్యాడ్మింటన్ కోసం రూ.72.03 కోట్లను ప్రభుత్వం ఖర్చు పెట్టింది.
ఆ తర్వాత వరుసగా బాక్సింగ్‌కు రూ.60.93 కోట్లు, షూటింగ్‌కు రూ.60.42 కోట్లు, హాకీకి రూ.41.3 కోట్లు, ఆర్చరీకి రూ.39.18 కోట్లు, రెజ్లింగ్‌కు రూ.37.8 కోట్లు, వెయిట్లిఫ్టింగ్కు రూ.27 కోట్లు, టేబుల్ టెన్నిస్‌కు రూ.12.92 కోట్ల చొప్పున కేంద్రం ప్రభుత్వం ఖర్చు చేసింది. అదేవిధంగా జూడోకు రూ.6.33 కోట్లు, స్విమ్మింగ్‌కు రూ.3.90 కోట్లు, రోయింగ్‌కు రూ.3.89 కోట్లు, సెయిలింగ్‌కు రూ.3.78 కోట్లు ఖర్చు పెట్టింది. ఇక గోల్ఫ్‌కు రూ.1.74 కోట్లు, టెన్నిస్‌కు రూ.1.67 కోట్లు, ఈక్వెస్ట్రియన్‌కు రూ.95.42 కోట్లను కేంద్ర ఖర్చుచేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

