శరద్ కుమార్‌కు అస్వస్థత

న్యూఢిల్లీ: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకాన్ని అందించిన శరద్ కుమార్ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. అతడికి ఛాతిలో నొప్పి పెరగడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ దవాఖానలో చేర్చారు. శరద్‌ను పరీక్షించిన వైద్యులు గుండె వాపు సమస్య ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇంకా కొన్ని పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 29 ఏండ్ల శరద్ గురువారం మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో నా గుండెకు వాపు ఉన్నట్లు తెలిసింది. వైద్య పరీక్షలతో విసిగిపోయాను. త్వరగా ఇంటికి వెళ్లాలని కోరకుంటున్నా’ అని పేర్కొన్నాడు. టోక్యో వేదికగా ఇటీవల జరిగిన పారాలింపిక్స్ హై జంప్ టీ-42 విభాగంలో శరద్ 1.83 మీటర్ల ఎత్తు దూకి కాంస్య పతకం చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

