Cricket World Cup | చెన్నై: వన్డే ప్రపంచకప్‌లో మరో కీలక సమరానికి వేళైంది. స్పిన్‌కు అనుకూలించనున్న చెపాక్ పిచ్‌పై శుక్రవారం దక్షిణాఫ్రికాతో పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనుంది. నెదర్లాండ్స్ చేతిలో పరాజయం తప్ప.. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గిన దక్షిణాఫ్రికా ఫుల్ జోష్‌లో ఉంటే.. మరోవైపు పాకిస్థాన్ మాత్రం హ్యాట్రిక్ పరాజయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది.
సఫారీ టీమ్ 8 పాయింట్లతో పట్టిక రెండో స్థానంలో ఉండగా.. పాకిస్థాన్ ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో నాలుగు పాయింట్లు మాత్రమే ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ సెమీఫైనల్ రేసు నుంచి తప్పుకోగా.. ఈ మ్యాచ్‌లో ఓడితే పాకిస్థాన్‌కు కూడా దారులు మూసుకుపోనున్నాయి.