Pak vs Aus | బాబర్, రిజ్వాన్ సెంచరీలు.. ఆస్ట్రేలియాతో పాక్ రెండో టెస్టు డ్రా
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (196), వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ (104 నాటౌట్) పట్టుదల ప్రదర్శించడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టును పాక్ డ్రా చేసుకోగలిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. ఉస్మాన్ ఖవాజా (160), స్టీవ్ స్మిత్ (72), అలెక్స్ కేరీ (93) అద్భుతంగా ఆడటంతో 556/9 వద్ద డిక్లేర్ చేసింది.
ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన పాకిస్తాన్‌ను ఆసీస్ బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. దీంతో ఆసీస్ భారీ స్కోరుకు ప్రతిగా పాక్ కేవలం 148 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు ఉస్మాన్ ఖవాజా (44 నాటౌట్), మార్నస్ లబుషేన్ (44) రాణించడంతో 97/2 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 506 పరుగుల భారీ లక్ష్యఛేదనలో పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హఖ్ (1), అజమర్ అలీ (6) నిరాశ పరిచారు.
అయితే ఆ తర్వాత అబ్దుల్లా షఫీక్ (96)కు జతకలిసిన బాబర్ ఆజమ్ (196).. జట్టును ముందుకు తీసుకెళ్లాడు. వీళ్లిద్దరూ ఐదో రోజు ఆట మొదలయ్యాక కూడా ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. నాలుగో రోజు అతని క్యాచ్ జారవిడిచిన స్మిత్.. ఐదో రోజు మాత్రం క్యాచ్ ఒడిసి పట్టేసి షఫీక్‌ను పెవిలియన్ చేర్చాడు. బాబర్ ఆజమ్‌కు కూడా రెండు సార్లు లైఫ్ దక్కింది. ఈ అవకాశాలను చక్కగా ఉపయోగించుకున్న ఆజమ్.. పూర్తి ఆధిపత్యంతో ఆడాడు.
నాలుగో ఇన్నింగ్స్‌లో ఒక టెస్టు కెప్టెన్ చేసిన అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు. ఫావద్ ఆలమ్ (9) నిరాశపరిచినా.. పరిమిత ఓవర్ల ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ (104 నాటౌట్)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చేలా కనిపించాడు. కానీ అతన్ని నాథన్ లియాన్ అవుట్ చేశాడు. ఆ తర్వాత ఫహీమ్ అష్రాఫ్ (0), సాజిద్ ఖాన్ (9) తక్కువ స్కోర్లకే వెనుతిరిగారు. అయితే నౌమన్ అలీ ( 18 బంతుల్లో 0 నాటౌట్)తో కలిసి రిజ్వాన్ పోరాడాడు. దీంతో ఐదో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ జట్టు 443/7 స్కోరుతో నిలిచి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. బాబర్ ఆజమ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

