ఇండియన్ వెల్స్: ఇండియన్ వెల్స్ టోర్నీకి జపాన్ టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా దూరమైంది. ఇటీవల జరిగిన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అనూహ్య పరాజయంతో నిష్క్రమించిన ఒసాకా టెన్నిస్ నుంచి విరామానికి మొగ్గుచూపింది. ఈ విషయాన్ని గురువారం ఆమె తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా పేర్కొంది. యూఎస్ ఓపెన్‌లో మూడో రౌండ్లోనే వెనుదిరిగిన ఒసాకా..తాను మళ్లీ ఎప్పుడు టెన్నిస్ మ్యాచ్ ఆడుతానో తెలియదంటూ ఇటీవలే వ్యాఖ్యానించింది.