NZ vs SA: అనుభవలేమి.. అయితేనేమి..? కివీస్‌కు షాకిచ్చిన సఫారీ టీమ్
NZ vs SA: కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, రచిన్ రవీంద్ర, విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్ వంటి అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు ఉన్న జట్టును ఆటాడించింది. అంతగా అనుభవం లేని సఫారీ బౌలర్లు.. కివీస్ బ్యాటర్లలో ఒక్కరంటే ఒక్కరిని కూడా అర్థ సెంచరీ చేయనీయలేదు.
NZ vs SA: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న సౌతాఫ్రికా జట్టు.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టుకు షాకిచ్చింది. ఈ సిరీస్‌లో కెప్టెన్‌తో సహా ఏడుగురు కొత్తవాళ్లతో బరిలోకి దిగిన దక్షణాఫ్రికా.. తొలి ఇన్నింగ్స్‌లో 242 పరుగులకే ఆలౌట్ అయినా కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, రచిన్ రవీంద్ర, విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్ వంటి అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు ఉన్న జట్టును ఆటాడించింది. అంతగా అనుభవం లేని సఫారీ బౌలర్లు.. కివీస్ బ్యాటర్లలో ఒక్కరంటే ఒక్కరిని కూడా అర్థ సెంచరీ చేయనీయలేదు. ఆ జట్టు స్పిన్నర్ డేన్ పీడ్ట్ ఐదు వికెట్లు (5/89) పడగొట్టి కివీస్ బ్యాటింగ్ వెన్ను విరిచాడు.
ఆట రెండో రోజు 220-6 ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. మంగళవారం ఉదయం సెషన్లో మరో 22 పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన న్యూజిలాండ్.. స్కోరుబోర్డుపై ఒక్క పరుగు చేరగానే వికెట్ పడింది. రెండో వికెట్‌కు టామ్ లాథమ్ (40), కేన్ విలియమ్సన్ (43) లు రెండో వికెట్ భాగస్వామ్యానికి 74 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టుకు ఇదే అత్యధిక భాగస్వామ్యం. లాథమ్‌తో పాటు కేన్ మామను పీడ్ట్ త్వరత్వరగా ఔట్ చేశాడు. తొలి మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన రచిన్ రవీంద్ర (29)ను మోరెకి వెనక్కిపంపాడు. విల్ యంగ్ (36) కాసేపు ప్రతిఘటించినా పీడ్ట్ అతడిని కూడా ఔట్ చేసి కివీలకు వరుస షాకులిచ్చాడు.
A brilliant comeback 💥
Dane Piedt grabs a five-wicket haul in Tests after over eight years 👏#NZvSA #WTC25 pic.twitter.com/qAgosOQPWM
— ICC (@ICC) February 14, 2024
ఇదే ఊపులో పీటర్సన్.. వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ (4)ను ఔట్ చేయగా గ్లెన్ ఫిలిప్స్ (4) ను పీడ్ట్ ఔట్ చేశాడు. ఆఖర్లో నీల్ వాగ్నర్ (33) మెరుపులతో కివీస్ జట్టు 200 పరుగుల మార్కును దాటింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్.. 77.3 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 31 పరుగులు వెనుకబడి ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

