NZ vs AUS | కష్టాల్లో ఆసీస్.. పది ఓవర్లకు స్కోరు ఎంతంటే?
NZ vs AUS | టీ20 ప్రపంచకప్ సూపర్-12 దశలో భాగంగా న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తడబడుతోంది. న్యూజిల్యాండ్ నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో
టీ20 ప్రపంచకప్ సూపర్-12 దశలో భాగంగా న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తడబడుతోంది. న్యూజిల్యాండ్ నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ టాపార్డర్ కుదేలైంది. డేవిడ్ వార్నర్ (5), ఆరోన్ ఫించ్ (13), మిచెల్ మార్ష్ (16), మార్కస్ స్టొయినిస్ (7) విఫలమయ్యారు. వీళ్లు ఏమాత్రం పోరాడలేకపోయారు.
దీంతో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (16 నాటౌట్)పై భారం పడింది. ఈ క్రమంలో పది ఓవర్లు ముగిసే సరికి 62/4 స్కోరుతో నిలిచిందా జట్టు. ఈ సమయంలో మ్యాక్స్‌వెల్‌కు సహకారం అందిస్తాడని అనుకున్న టిమ్ డేవిడ్ (11)ను 11వ ఓవర్లో శాంట్నర్ అవుట్ చేశాడు. ఆ ఓవర్ తొలి బంతికి భారీ సిక్సర్ బాదిన టిమ్ డేవిడ్.. ఆ మరుసటి బంతికి మరో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో పెవిలియన్ చేరాడు. దీంతో ఆ జట్టు 68 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- \
- NZ vs AUS
- Super 12
- T20 World Cup
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rains | తుపాను ఎఫెక్ట్.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో నిలిచిన రాకపోకలు
NZvIND: సూర్యవంశీ ఔట్.. కివీస్ ఫస్ట్ బ్యాటింగ్
Janhvi Kapoor | గోల్డెన్ గ్లామర్‌లో జాన్వీ కపూర్.. కుర్రాళ్లను కట్టిపడేస్తున్న ఫొటోలు
మద్యం సేవించి వాహనాలు నడపొద్దు : ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్
Comrade Kalyan | 21 రోజుల్లోనే ఓటీటీలోకి ‘కామ్రేడ్ కళ్యాణ్’.. ఎలాంటి ప్రకటన లేకుండా స్ట్రీమింగ్ ప్రారంభం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

