జోకోవిచ్ 25 గ్రాండ్‌స్లామ్‌లు గెలుస్తాడు..

లండన్: టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్ తాజాగా వింబుల్డన్ నెగ్గి తన ఖాతాలో 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను వేసుకున్న విషయం తెలిసిందే. జోకోవిచ్‌పై టెన్నిస్ లెజెండ్ జాన్ మెకన్రో లేటెస్ట్గా ఓ కామెంట్ చేశారు. ఒకవేళ జోకోవిచ్ 25 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలవకుంటే ఆశ్చర్యమే అవుతుందని మెకన్రో అన్నారు. రోజర్ ఫెదరర్, రఫేల్ నాదల్ ఖాతాల్లో కూడా 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు ఉన్న విషయం తెలిసిందే. జోకోవిచ్ ఆట తీరు మరింత పరిణితి చెందిందని మెకన్రో అన్నారు. కనీసం మరో నాలుగు లేదా అయిదు గ్రాండ్‌స్లామ్‌లు అతను గెలిచే ఛాన్సు ఉందని అన్నారు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్‌తో పాటు వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌ను అతను గెలిచాడు. జోకోవిచ్ చరిత్ర సృష్టించే దిశలో వెళ్తున్నాడని, తీవ్రమైన వత్తిడిని ఎదుర్కొని ముందుకు సాగుతున్నాడని మెకన్రో అన్నారు. 2013 నుంచి 2016 మధ్య జోకోవిచ్‌కు బోరిస్ బేకర్ కోచ్‌గా ఉన్నాడు. ఆ సమయంలో ఆరు టైటిళ్లను జోకో గెలిచాడు. ప్రస్తుతం వింబుల్డన్ మాజీ చాంపియన్ ఇవానిసెవిక్ ఆధ్వర్యంలో జోకో శిక్షణ జరుగుతున్నది. యూఎస్ ఓపెన్‌లో కూడా అతను టైటిల్‌ను గెలుస్తాడని ఇవానిసెవిక్ విశ్వాసం వ్యక్తం చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
Jupally Krishna Rao | మంత్రి జూపల్లిని విమర్శించారని.. యువకుడిని చితకబాదిన ఎస్సై
Nereducherla | బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల దాడి!
Journalist Shankar | ప్రశ్నించినందుకు జర్నలిస్టు శంకర్ అరెస్ట్.. మెడికవర్ యాజమాన్యం ఫిర్యాదుపై కేసు
Asian Para Games | భారత్‌కు ఒక్క రోజే 26 మెడల్స్.. 2 స్వర్ణాలతో మెరిసిన ఆర్చర్ శీతల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

