Djokovic | జకోవిచ్‌కు టీకాపై నమ్మకం లేదట?.. అందులో మెజారిటీ వాటాలు ఆయనవే!
Djokovic | టెన్నిస్ ప్లేయర్ జకోవిచ్‌కు టీకాపై నమ్మకం లేదట.. కానీ ఓ ఫార్మా కంపెనీలో మెజారిటీ వాటాలు ఉన్నాయి.

Novak Djokovic | ఆయన ప్రపంచ అగ్రశ్రేణి ఆటగాడు.. ఆయన పేరు నొవాక్ జకోవిచ్. ప్రముఖ టెన్నిస్ ప్లేయర్.. అంతేకాదు నంబర్ వన్ ర్యాంక్ ఆయన సొంతం.. ప్రపంచ మానవాళిని వణికిస్తున్న మహమ్మారి ఆట కట్టించేందుకు ఫార్మాస్యూటికల్ సంస్థలు ఆవిష్కరించిన వ్యాక్సిన్లపై.. వాటి పనితీరుపై నమ్మకం లేదని ఇటీవల చెప్పారు. కొవిడ్ వ్యాక్సినేషన్‌తో నమ్మకం లేదని అన్నందుకు ఆయన ఏకంగా ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీకే దూరమయ్యాడు.
కానీ ఆయన ఓ వ్యాక్సిన్ తయారీ సంస్థ క్వాంట్ బయోరిస్ అనే బయోటెక్ సంస్థలో పెట్టుబడులు పెట్టారన్న సంగతి బయటపడింది. 2020 జూన్‌లో ఈ కంపెనీ ప్రారంభమయ్యింది. దీని వ్యవస్థాపకుల్లో జకోవిచ్ కూడా ఒకరు అని క్వాంట్ బయోరిస్ సీఈవో ఐవాన్ లాంకేర్విక్ తెలిపారు. జకోవిచ్‌కు ఆయన భార్య జెలెనాకూ సంస్థలో 80 శాతం వాటాలు ఉన్నాయని తెలుస్తున్నది. ఈ సంస్థకు బ్రిటన్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, స్లోవేనియా తదితర దేశాల్లోని 20 ప్రాంతాల్లో కార్యాలయాలు ఉండటం ఆసక్తికర పరిణామం అంటున్నారు.
వైరస్‌లపై పోరకు.. బ్యాక్టీరియాను ఎదుర్కోవడానికి నూతన టెక్నాలజీ డెవలప్చేయడమే తమ సంస్థ లక్ష్యం అని ఐవాన్ లాంకేర్విక్ తెలిపారు. కోవిడ్-19పై రీసెర్చ్ ప్రారంభించాం. కరోనా వైరస్‌పై సక్సెస్ సాధిస్తే, ఇతర వైరస్లమీదా విజయం సాధించినట్లేనన్నారు. వచ్చే వేసవిలో బ్రిటన్‌లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అయితే బయోటెక్ సంస్థలో వాటాలపై స్పందించడానికి జకోవిచ్ అధికార ప్రతినిధి నిరాకరించారు.
గత నెలలో కరోనా బారిన పడ్డ జకోవిచ్.. వైద్యపరమైన మినహాయింపులు ఇవ్వాలని కోరినా ఆస్ట్రేలియా సర్కార్ ససేమిరా అంది. కోర్టుకెళ్లినా చుక్కెదురు కావడంతో ఇంటిముఖం పట్టక తప్పలేదు. కరోనా బారిన పడ్డా క్వారంటైన్లో ఉండకుండా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో ఈ స్టార్ ఆటగాడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

