Shubman Gill: సారా టెండూల్కర్ కాదు..! గిల్ డేటింగ్ చేస్తోంది ఈ నటితోనా..? పిక్స్ వైరల్
Shubman Gill: వన్డే వరల్డ్ కప్ తర్వాత కొద్దిరోజులు విశ్రాంతి తీసుకున్న ఈ పంజాబీ బ్యాటర్.. ఇటీవలే లండన్‌కు వెళ్లాడు. అక్కడ బాలీవుడ్ నటి, తన హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తున్న...
Shubman Gill: టీమిండియా యువ ఓపెనర్, భావి భారత సారథిగా భావిస్తున్న శుభ్‌మన్ గిల్.. సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్‌తో డేటింగ్ చేస్తున్నారని గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి రెస్టారెంట్లకు తిరగడం, సోషల్ మీడియాలో ఒకరి పోస్టులకు ఒకరు లైకులు కొట్టడం, గిల్ ఆడే మ్యాచ్‌లకు సారా రావడంతో ఈ ఇరువురి మధ్య ‘ఏదో నడుస్తుంద’నే గాసిప్స్ వస్తున్నాయి. అయితే తమ మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌పై గిల్ గానీ సారా గానీ ఇంతవరకూ రెస్పాండ్ కాలేదు. వీళ్ల రిలేషన్షిప్ పై సస్పెన్స్ కొనసాగుతుండగానే గిల్.. సారాతో కాకుండా మరో అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడన్న రూమర్స్ సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి.
వన్డే వరల్డ్ కప్ తర్వాత కొద్దిరోజులు విశ్రాంతి తీసుకున్న ఈ పంజాబీ బ్యాటర్.. ఇటీవలే లండన్‌కు వెళ్లాడు. అక్కడ బాలీవుడ్ నటి, తన హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తున్న అవనీత్ కౌర్‌తో లండన్‌లో చెట్టాపట్టాలేసుకుని తిరగడం కొత్త రూమర్స్‌కు తావిస్తున్నది. గిల్.. అవనీత్ కౌర్ లు డేటింగ్ చేస్తున్నట్టు సోషల్ మీడియా కోడై కూస్తోంది. గిల్, అవనీత్ కౌర్‌లు కలిసున్న ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి.
సాంగ్ షూట్ కోసమేనా..?
గిల్, అవనీత్ కౌర్‌లు లండన్‌కు వెళ్లింది ఓ పాట షూటింగ్ కోసమని కూడా వార్తలు వస్తున్నాయి. ఓ పంజాబీ ఆల్బమ్ కోసం గిల్, అవనీత్ తో పాటు నిర్మాత రాఘవశర్మ, అన్షుల్ గార్గ్ కూడా ఉన్నారు. వీరంతా కలిసి లండన్ వీధుల్లో ఉన్న ఫోటోలను షేర్ చేయడంతో గిల్ డేటింగ్ రూమర్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే గిల్ ఈ వీడియోలో నటిస్తున్నాడా..? లేక విహారయాత్రలో భాగంగా వెళ్లాడా..? అనేది కూడా క్లారిటీ లేదు. టీమిండియాలో ఇప్పటికే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న గిల్.. ఈ వీడియోలో గనక నటిస్తే అది బంపర్ హిట్ అవడం ఖాయం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్‌కట్ వెర్షన్’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

