జొకోవిచ్‌కు నో ఎంట్రీ

- వీసా రద్దు.. ఆస్ట్రేలియాలోకి అనుమతి నిరాకరణ
- మెల్బోర్న్ విమానాశ్రయంలో అడ్డగింత
- టోర్నీలో ఆడేది అనుమానం
బ్రిస్బేన్: ప్రపంచ నంబర్‌వన్ ప్లేయర్, సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జొకోవిచ్‌కు ఆస్ట్రేలియా గడ్డపై అనుకోని అవాంతరం ఎదురైంది. విక్టోరియా ప్రభుత్వం వైద్య మినహాయింపులతో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పాల్గొనేందుకు మెల్బోర్న్కు చేరుకున్న జొకోను ఇమిగ్రేషన్ అధికారులు నిలువరించారు. మినహాయింపులపై సరైన ఆధారాలు లేని కారణంగా అతడి వీసాను రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా సరిహద్దు భద్రతా అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఈనెల 17 నుంచి మొదలయ్యే గ్రాండ్‌స్లామ్ టోర్నీలో జొకో ఆడేది సందిగ్ధంగా మారింది. వ్యాక్సినేషన్ విషయంలో ఆది నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న జొకోవిచ్‌కు మినహాయింపులు ఎలా ఇస్తారంటూ ఆస్ట్రేలియా వాసుల నుంచి వచ్చిన వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకుంది. ఆసీస్‌లో ఆయా రాష్ర్టాల మధ్య ప్రయాణానికి మినహాయింపులు ఇచ్చిన అక్కడి ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగిస్తున్నది. ఈ క్రమంలో విక్టోరియా ప్రభుత్వ అనుమతితో టోర్నీ ఆడేందుకు వచ్చిన జొకో వీసా దరఖాస్తుపై అధికారులు సంతృప్తి చెందకపోవడం వివాదానికి కారణమైంది. దీనిపై ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు జొకో సిద్ధమయ్యాడు. సోమవారం విచారణ జరిగే అవకాశమున్న నేపథ్యంలో అప్పటి వరకు అతడు ఆస్ట్రేలియాను విడిచి వెళ్లే అవకాశం లేదని ప్రభుత్వ న్యాయవాది ఒకరు పేర్కొన్నారు.
అందరికీ ఒకే నిబంధనలు వర్తిస్తాయి. ఇది చాలా క్లియర్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దేశం కంటే ఎవరూ ఎక్కువ కాదు. వైద్య మినహాయింపు విషయంలో జొకో దగ్గర సరైన ఆధారాలు లేని కారణంగా అధికారులు వీసా రద్దు చేశారు. -మారిసన్, ఆస్ట్రేలియా ప్రధాని
జొకోవిచ్‌కు సెర్బియా మొత్తం అండగా ఉంది. అతని పట్ల ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని చూస్తున్నాం. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్లేయర్‌ను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం వెంటనే ఆపేయాలి.
-అలెగ్జాండర్ వుసిచ్, సెర్బియా ప్రధాని
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

