Neymar | వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో గాయం.. బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్‌కు సర్జరీ
Neymar : బ్రెజిల్ ఫుట్‌బాలర్ అభిమానులకు పెద్ద షాక్. ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో గాయపడిన స్టార్ ఫుట్‌బాలర్ నెయ్మర్(Neymar) ఏడాది పాటు ఆటకు దూరం కానున్నాడు. ఉరుగ్వేతో మ్యాచ్ సమయంలో నెయ్మర్..
Neymar : బ్రెజిల్ ఫుట్‌బాలర్ అభిమానులకు పెద్ద షాక్. ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో గాయపడిన స్టార్ ఫుట్‌బాలర్ నెయ్మర్(Neymar) ఏడాది పాటు ఆటకు దూరం కానున్నాడు. ఉరుగ్వేతో మ్యాచ్ సమయంలో నెయ్మర్ ఎడమ మోకాలికి (ఆంటీరియర్ క్రుసియేట్ లిగమెంట్) దెబ్బ తగలడంతో విలవిలలాడాడు. నడవలేని స్థితిలో ఉన్న అతడిని గ్రౌండ్ సిబ్బంది స్ట్రెచర్ మీద తీసుకెళ్లారు.
ఎంఆర్ఐ స్కాన్ అనంత రం నెయ్మర్కు గాయం తీవ్రత ఎక్కువ ఉందని.. అత్యవసరంగా సర్జరీ చేయాలని వైద్యులు సూచించడంతో వెంటనే ఆపరేషన్ చేశారు. శనివారం నాడు డిశ్చార్జ్ కానున్న అతడు కోలుకునేందుకు ఏడాది పట్టనుంది. ‘నెయ్మర్కు సర్జరీ విజయవంతం అయింది. అతడు మరో 24 నుంచి 48 గంటలు ఆస్పత్రిలోనే ఉండే అవకాశం ఉంద’ని బ్రెజిల్ టీమ్ డైరెక్టర్ రోడ్రిగో లాస్మర్ ఓ ప్రకటనలో తెలిపాడు.

సర్జరీ తర్వాత ఆస్పత్రి బెడ్‌మీద ఉన్న ఫొటోలను నెయ్మర్ సోషల్‌మీడియాలో పెట్టాడు. వాటికి ‘అంతా సవ్యంగానే ఉంది’ అని క్యాప్షన్ రాశాడు. ఈమధ్యే పారిస్ సెయింట్ జర్మనీ క్లబ్‌ను వీడిన నెయ్మర్ సౌదీ అరేబియాకు చెందిన అల్ హిలాల్ క్లబ్‌కు మారిన విషయం తెలిసిందే. నిరుడు ఖతర్ వేదికగా జరిగిన వరల్డ్ కప్‌లో నెయ్మర్ బ్రెజిల్ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. అయితే.. క్రొయేషియా 4-2తో బ్రెజిల్ ప్రపంచ కప్ ఆశలపై నీళ్లు చల్లింది.
ఇవి కూడా చదవండి
Shreyas Iyer | అయ్యర్‌కు బెస్ట్ ఫీల్డర్ అవార్డు.. సెలబ్రేషన్ వీడియో చూశారా..?
T20 World Cup 2024 | టీ20 వరల్డ్ కప్… ప్లే ఆఫ్స్ బెర్తుకు పోటీపడుతున్న పసికూనలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

