మీర్పూర్: గ్లెన్ ఫిలిప్స్ (72 బంతుల్లో 87; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయడంతో బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ కోలుకుంది. బంగ్లా తొలి ఇన్నింగ్స్లో 172 పరుగులకు ఆలౌట్ కాగా.. ఓవర్నైట్ స్కోరు 55/5తో శుక్రవారం మూడో రోజు ఆట కొనసాగించిన న్యూజిలాండ్ 180 పరుగులకు ఆలౌటైంది.
లాథమ్ (4), కాన్వే (11), విలియమ్సన్ (13), నికోల్స్ (1), మిషెల్ (18), బ్లండెల్ (0), శాంట్నర్ (1) విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో మెహదీ, తైజుల్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా 2 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. చేతిలో 8 వికెట్లు ఉన్న బంగ్లా.. ఓవరాల్గా 30 పరుగుల ఆధిక్యంలో ఉంది.