నెదర్లాండ్స్ వచ్చేసింది..
ఆల్‌రౌండర్ బాస్ డి లీడ్ అదరగొట్టడంతో నెదర్లాండ్స్ జట్టు వన్డే ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ టోర్నీ తమ చివరి సూపర్ సిక్స్ మ్యాచ్‌లో గురువారం నెదర్లాండ్స్ 4 వికెట్ల తేడాతో స్కాట్లాండ్ను చిత్తుచేసింది.
- వన్డే ప్రపంచకప్ టోర్నీకి అర్హత
- స్కాట్లాండ్పై సూపర్ విక్టరీ
- లీడ్ ఆల్‌రౌండ్ షో
బులావాయో: ఆల్‌రౌండర్ బాస్ డి లీడ్ అదరగొట్టడంతో నెదర్లాండ్స్ జట్టు వన్డే ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ టోర్నీ తమ చివరి సూపర్ సిక్స్ మ్యాచ్‌లో గురువారం నెదర్లాండ్స్ 4 వికెట్ల తేడాతో స్కాట్లాండ్ను చిత్తుచేసింది. మొదట స్కాట్లాండ్ 9 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. బాండ్రన్ మెక్మలెన్ (106) సెంచరీ చేయగా.. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డి లీడ్ 5 వికెట్లు పడగొట్టాడు. లక్ష్యఛేదనలో నెదర్లాండ్స్ 42.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 278 రన్స్ చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ బాస్ డి లీడ్ (92 బంతుల్లో 123; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) వేగంగా ఆడి వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించేందుకు అవసరమైన రన్‌రేట్ అందించాడు.
నెదర్లాండ్స్ ఐదోసారి..
పసికూన ముద్ర చెరిపేసుకునేందుకు ప్రయత్నిస్తున్న నెదర్లాండ్స్ జట్టు వన్డే ప్రపంచకప్‌నకు అర్హత సాధించడం ఇది ఐదోసారి. గతంలో 1996, 2003, 2007, 2011లో ఆ జట్టు వరల్డ్‌కప్ ఆడింది. సూపర్ సిక్స్‌లో 5 మ్యాచ్‌లాడిన నెదర్లాండ్స్, స్కాట్లాండ్, జింబాబ్వే మూడేసి విజయాలతో తలా 6 పాయింట్లతో సమంగా నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్ కారణంగా నెదర్లాండ్స్ (0.16) ముందంజ వేయగా.. స్కాట్లాండ్ (0.10), జింబాబ్వే (-0.09) నిరాశగా ఇంటిదారి పట్టాయి. ఈ టోర్నీ నుంచి ఇప్పటికే శ్రీలంక వన్డే ప్రపంచకప్ బెర్త్ దక్కించుకున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

