నీరజ్‌కు ఒలింపిక్ బెర్త్
ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో భారత్‌కు రెండో బెర్తు దక్కింది. యువ షూటర్ నీరజ్ కుమార్ 2028 ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో భాగంగా బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల త్రీ పొజిషన్స్ ఈవెంట్లో నీరజ్.
- వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్యం
దోహా: ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో భారత్‌కు రెండో బెర్తు దక్కింది. యువ షూటర్ నీరజ్ కుమార్ 2028 ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో భాగంగా బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల త్రీ పొజిషన్స్ ఈవెంట్లో నీరజ్. 346.5 పాయింట్లు స్కోరు చేసి కాంస్యం సాధించాడు. దాంతో లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ కోటా దక్కించుకున్నాడు.
ఈ పోటీలో న్యూట్రల్ అథ్లెట్ గా బరిలోకి దిగిన దిమిత్రి పిమెనొవ్ 362.8 పాయింట్లతో స్వర్ణం నెగ్గగా స్లోవేకియా షూటర్ ప్యాట్రిక్ జానీ (355.9) రజతం గెలిచాడు. నీరజ్‌కు వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో ఇదే తొలి పతకం కావడం గమనార్హం. కాగా ఇదే టోర్నీలో జైపాల్ మాలవీయ భారత్ తరఫున ఒలింపిక్స్‌లో మొదటి బెర్తును దక్కించుకున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

