గనేమత్, అనంత్‌జీత్‌కు టైటిల్స్
స్కీట్ షూటింగ్లో ఎదురులేని గనేమత్ షెకాన్, అనంత్‌జీత్ సింగ్ నరూక మరోసారి తమ సత్తా చాటుతూ జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మహిళల, పురుషుల టైటిల్స్ సొంతం చేసుకున్నారు.66వ జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పంజాబ్‌కు చెందిన గనేమత్ మహిళల క్వాలిఫయింగ్ రౌండ్లో షూటౌట్ ద్వారా ఫైనల్‌కు చేరుకుంది.
న్యూఢిల్లీ : స్కీట్ షూటింగ్లో ఎదురులేని గనేమత్ షెకాన్, అనంత్‌జీత్ సింగ్ నరూక మరోసారి తమ సత్తా చాటుతూ జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మహిళల, పురుషుల టైటిల్స్ సొంతం చేసుకున్నారు.66వ జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పంజాబ్‌కు చెందిన గనేమత్ మహిళల క్వాలిఫయింగ్ రౌండ్లో షూటౌట్ ద్వారా ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్లో 60 షాట్లకు 56 షాట్లు గురితప్పకుండా కాల్చిన గనేమత్ అగ్రస్థానంలో నిలిచింది.
క్వాలిఫయింగ్‌లో ప్రథమ స్థానంలో నిలిచిన జహ్రా దీశవాలా 55 షాట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. సంజన సూద్ 44 షాట్లతో మూడో స్థానంలో నిలిచింది. పురుషుల విభాగం క్వాలిఫయింగ్‌లో అనంత్‌జీత్ 125 షాట్లకు 123 గురిపెట్టి కాల్చి అందరికంటే ముందు నిలిచాడు. ఆరుగురు తలపడిన ఫైనల్లో కూడా అనంత్‌జీత్ 58/60తో అగ్రస్థానం దక్కించుకున్నాడు. మునేక్ బటూలా (55 షాట్లు), భవతేజ్ గిల్ (45 షాట్లు) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలుచుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

