మహబూబ్‌నగర్ అర్బన్, అక్టోబర్ 8 : జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలు మహబూబ్‌నగర్‌లో ఉత్సాహంగా ప్రారంభమయ్యా యి. గురువారం జిల్లా కేంద్రంలోని జయప్రకాశ్ నారాయణ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో పోటీలను ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ డీకే అరుణ, జేపీఎన్సీ చైర్మన్ రవికుమార్ ప్రారంభించారు.
నాలుగురోజుల పాటు జరిగే పోటీలలో దేశంలోని పలు రాష్ర్టాల క్రీడాకారులు పాల్గొంటున్నారు. మొదటి రోజు 67 కేజీల బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ గెలిచాడు.