National Boxing Championships: షిల్లాంగ్ (మేఘాలయా) వేదికగా జరుగుతున్న పురుషుల జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్ – 2023లో భారత బాక్సర్లు శివ థప, అమిత్ పంఘల్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. 63.5 కిలోల విభాగంలో పోటీ పడుతున్న శివ.. 5-0 తేడాతో కర్నాటకకు చెందిన సంతోష్ హెచ్‌కె పై విజయం సాధించాడు. అసోంకు చెందిన శివ.. గతేడాది ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. క్వార్టర్స్‌లో అతడు ఢిల్లీకి చెందిన బాక్సర్ శశాంక్ ప్రధాన్‌ను ఢీకొట్టనున్నాడు.
ఇక 51 కిలోల విభాగంలో పోటీ పడుతున్న అమిత్ పంఘల్.. 4-1 తేడాతో పంజాబ్‌కు చెందిన జయ్‌దీప్ సింగ్‌పై గెలిచాడు. క్వార్టర్స్ పోరులో అతడు జమ్మూ కాశ్మీర్ బాక్సర్ మహ్మద్ అరిఫ్‌తో తలపడనున్నాడు. 2019లో వరల్డ్ ఛాంపియన్షిప్ లో రజతం గెలిచిన పంఘల్.. ఈసారి జాతీయ ఛాంపియన్షిప్ గెలుచుకునే దిశగా ముందుకు సాగుతున్నాడు. 92 కిలోల విభాగంలో 2021 ఆసియన్ ఛాంపియన్షిప్ విజేత సంజీత్.. 5-0 తేడాతో సావన్ గిల్‌ను ఓడించాడు. క్వార్టర్స్‌లో అతడు నమన్ తన్వర్ తో పోటీ పడనున్నాడు.
Shiva Thapa & Amit Panghal to headline 7th Elite Men’s National Boxing Championships
Read more: https://t.co/VbGZLvNWmK@tapasjournalist pic.twitter.com/WUTDbG0cvI
— DD News (@DDNewslive) November 24, 2023