IPL 2024 SRH vs KKR ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 వ సీజన్ డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. టి.నటరాజన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి కోల్‌కతా నైట్ రైడర్స్‌ను దెబ్బకొట్టాడు. డేంజరస్ వెంకటేశ్ అయ్యర్(7), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(0)లను ఔట్ చేసి కోల్‌కతా నడ్డి విరిచాడు. దాంతో, పర్పుల్ జెర్సీ జట్టు 4 ఓవర్లలో 32 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం నితీశ్ రానా(0), ఓపెన్ ఫిలిఫ్ సాల్ట్(21)లు క్రీజులో ఉన్నారు.
ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ ఓడిన కోల్‌కతా బ్యాటింగ్‌కు దిగింది. మార్కో జాన్సెన్ ఓవర్లో సాల్ట్ రెచ్చిపోయాడు. ఏకంగా హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. అయితే.. ఆఖరి బంతికి అతడు సింగిల్‌కు ప్రయత్నించాడు. కానీ, నాన్‌స్ట్రయికర్ సునీల్ నరైన్(2) ఆసల్యంగా స్పందించాడు. ఆలోపే షాబాద్ అహ్మద్ బంతిని వికెట్లకు గురి చూసి కొట్టాడు. దాంతో, కోల్‌కతా 23 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.